Delhi High Court: భర్త ఆర్థిక పరిమితికి మించి కోరికలు, కలలని నెరవేర్చాలని భార్య ఒత్తిడి చేయడం నిరంతర అసంతృప్తికి కారణమవుతుందని, చివరకు వైవాహిక జీవితంలో సంతోషం, సామరస్యానికి భంగం కలుగుతుందని, ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్య క్రూరత్వం కారణంగా ఓ జంట విడాకుల కేసులో, విడాకులను సమర్థిస్తూ.. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్లో అబోట్టాబాద్‌లో బిన్ లాడెన్‌ని చంపేశారు. తాజాగా జియో న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
LK Advani: బీజేపీ సీనియర్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘భారతరత్న’ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ఎల్కే అద్వానీకి ఈ అవార్డు రావడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ ఢిల్లీలోని ఆయన నివాసంలో లడ్డూ అందించి అభినందించారు.
PM Modi: ట్రక్, టాక్సీ డ్రైవర్లకు ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో మాట్లాడారు. ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల వెంబడి కొత్త సౌకర్యాలతో ఆధునిక భవనాలను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. లక్షలాది ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నారని, వారు తరుచు చాలా గంటలు పనిచేస్తారని, వారికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల…
Monkey Fever Cases: కర్ణాటక రాష్ట్రంలో ‘‘మంకీ ఫీవర్’’ కేసులు భయాందోళనలను రేపుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో గత 15 రోజుల్లో 31 మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. వ్యాధి సోకిన వారిలో 12 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మిగతా వారు ఇంట్లేనే వైద్యం తీసుకుంటున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, ఇప్పటి వరకు ఎలాంటి సీరియస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. సిద్ధాపూర్ తాలూకాలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు అందించింది. ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శుక్రవారం నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అయితే, క్రైమ్ బ్రాంచ్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని
Indian Navy: భారత నేవీ దెబ్బకు మరోసారి సముద్ర దొంగల ప్రయత్నం విఫలమైంది. సోమాలియా తూర్పు తీరం వెంబడి మరో పైరసీ ప్రయత్నాన్ని అడ్డుకుంది. జనవరి 31న ఎంవీ ఒమారీ అనే ఇరానియన్ ఫ్లాగ్డ్ కలిగి ఉన్న ఫిషింగ్ నౌకపై ఏడుగురు సముద్ర దొంగల దాడిని నిలువరించి పాకిస్తాన్, ఇరాన్ సిబ్బంది రక్షించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
Students Died Abroad: ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో, అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి కన్నీటిని మిగులుస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, దుండగుల చేతిలో మరణించడం, ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
Bharat Mobility Global Expo 2024: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024ని సందర్శించి, భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఈవెంట్‌ని నిర్వహించిన ఆటోమొబైల్ పరిశ్రమను ప్రధాని అభినందించారు. ఎక్స్పోని పలు స్టాల్స్ తనని ఆకట్టుకున్నాయని, అయితే తాను పూర్తిగా అన్ని స్టాల్స్‌ని చూడలేకపోయానని అన్నారు. తాను ఎప్పుడూ కార్ కొనలేదని, చివరకు సైకిల్ కూడా కొనలేదని ప్రధాని అన్నారు.
Udhayanidhi Stalin: గతేడాది డీఎంకే పార్టీ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టింది. దేశవ్యాప్తంగా పలు చోట్లు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీశాడని చెబుతూ.. ఉదయనిధిపై కేసులు పెట్టారు.