Maldives: చైనా అనుకూలంగా వ్యవహరించే మహ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై అక్కడి మంత్రులు అవాకులు చెవాకులు పేలి తన పదవులను ఊడగొట్టుకున్నారు. భారత టూరిస్టులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. మరోవైపు ‘భారత్ అవుట్’ అనే విధానంతో తాను అధ్యక్షుడు కాగానే మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికులను వెళ్లగొడతానని ముయిజ్జూ చెప్పాడు. అందుకు అనుగుణంగానే పావలు కదుపుతున్నాడు.
ఇదిలా ఉంటే, తాజాగా మాల్దీవులు-భారత్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మాల్దీవులకు ఎకనామిక్ జోన్ సముద్రంలో చేపలు పడుతున్న మూడు బోట్లను భారత ఆర్మీ అడ్డగించిందని, ఇందుకు వివరణ ఇవ్వా్ల్సిందిగా మాల్దీవుల ప్రభుత్వం అధికారికంగా భారత్‌ని వివరాలను కోరింది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లేదు. జనవరి 31న మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని హాలీఫు అటోల్‌కి ఈశాన్యంగా 72 నాటికన్ మైళ్ల దూరంలోని మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో చేపల వేటలో ఉన్న మాల్దీవుల బోట్లను భారత సైన్యం అడ్డగించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Read Also: Poonam Pandey Alive: మనోభావాలు దెబ్బతిన్నాయ్ .. పూనమ్ పాండేపై కేసు పెట్టండి!
అంతర్జాతీయ సముద్ర చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ, ముందస్తు సమాచారం లేదకుండా భారత సైనికులు తమ ఫిషింగ్ బోట్లను ఎక్కారని మాల్దీవులు ఆరోపిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వాన్ని సమగ్ర వివరాలను కోరింది. తమ బోట్లను విచారించినందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బోర్డింగ్ టీమ్స్ బాధ్యత వహించాలని ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం మాల్దీవుల్లో 80 మంది భారతీయ సైనిక సిబ్బంది ఉంది. రెండు హెలికాప్టర్ల సాయంతో మాల్దీవుల ప్రజలకు వైద్య సేవల్ని అందిస్తోంది. అయితే, వీరిని ఉపసంహరించుకోవాలని మాల్దీవులు భారత్‌ని కోరుతోంది. దీనిపై ఇరు దేశాలు రెండుసార్లు చర్చించాయి. మరోవైపు భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అక్కడి ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.