Bombay High Court: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి, తన ప్రేమికుడిపై వేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ కొట్టేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా తామిద్దరం పెళ్లి చేసుకుంటామనే ఆలోచన మేరకే శృంగారంలో పాల్గొన్నామని, అయితే, తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని సదరు యువకుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
Read Also: Delhi High Court: ఆర్థిక పరిమితికి మించి భార్య కోరికలు కోరడం.. భర్తను మానసిక ఒత్తిడికి గురిచేయడమే..
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎండబ్ల్యూ చాంద్‌వానీ ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం కీలక తీర్పును చెప్పింది. వివాహం చేసుకుంటానే వాగ్ధానాన్ని మాత్రమే యువకుడు ఉల్లంఘించాడని, శారీరక సంబంధాన్ని పెట్టుకునేందుకు పెళ్లిని సాకుగా పెట్టుకోలేదని కోర్టు పేర్కొంది. వాగ్ధాన ఉల్లంఘన, హామీని నెరవేర్చకపోవడం మధ్య తేడా ఉందని కోర్టు చెప్పింది. అనుకోని పరిస్థితుల కారణంగానే యువకుడు తన హామీని నెరవేర్చలేని, ముందు నుంచి అతను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నాడని, తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదని, కాబట్టి అతడు అత్యాచారం చేశానడి చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.