PM Modi: రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసిందని, కానీ నాన్ స్టార్టప్ అని తేలిందని’’ అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన అతడిని లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
PM Modi: రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దళితులు, వెనకబడినవారికి, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని బోధించకూడదని అన్నారు. అంబేద్కర్ భారతరత్నకు అర్హడని కాంగ్రెస్ ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు.
PM Modi: పార్లమెంట్ ఎన్నికల ముందు చివరిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభలో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 40 సీట్లు దాటదని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాతబడిందని విమర్శించారు.
Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడి కోర్టులు వరస షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా కొలంబియా డిస్ట్రిక్ట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పును వెలువరించింది. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణపై అతనికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని, ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేదని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ నేర విచారణకు మరింత దగ్గరయ్యాడు.
USA: అమెరికాలో భారత విద్యార్థిపై దుండగులు దాడి చేరారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ ఘటన చికాగోలో జరిగింది. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగల దాడికి గురయ్యాడు. తీవ్రంగా కొట్టి, అతని సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఈ దాడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.
UPI Outage: దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ విఫలమవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలువురు నెటిజన్లు ఎక్స్(ట్విట్టర్)వేదికగా అంతరాయం గురించి ట్వీట్స్ చేశారు. తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)తో పాటు బ్యాంకింగ్ రంగం దేశవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో ఈ రోజు సాయంత్రం డిజిటల్ చెల్లింపుల్లో అవాంతరాలు ఎదురయ్యాయి.
Imran Khan: పాకిస్తాన్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ ఎన్నికలు వస్తున్నా్యి. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నాడు. ఇప్పటికే అక్కడి కోర్టులు అతనికి పలు కేసుల్లో జైలుశిక్ష విధించాయి. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తన ఎన్నికల చిహ్నాన్ని కూడా కోల్పోయింది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భయపెడుతున్నారు.
Ajit Pawar: కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
Supreme Court: సరోగసీ ద్వారా పిల్లలు కనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. 44 ఏళ్ల అవివాహిత మహిళ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పాశ్చాత్య దేశాల వలే వివాహం కాకుండా పిల్లలు కనడంలా కాకుండా, వివాహ పవిత్రతను కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టులో సరోగసీ ద్వారా తల్లికావడానికి అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ మహిళ ఒమన్ దేశంలో నరకయాతన పడుతోంది. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లిన సదరు మహిళను యజమాని చిత్రహింసలు పెడుతున్నారు. బందీగా ఉంచుకుని, వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ, తనను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్న మహిళ వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్యను ఒమన్ నుంచి కాపాడాలని మహిళ భర్త రాష్ట్ర పోలీసులను కోరాడు. ఆమెను విడిచిపెట్టేందుకు రూ. 2 లక్షలు- 3 లక్షలు కోరుతున్నట్లు జోగి ముఖేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ…