Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చని ఆదేశాలను కాపాడేందుకు కాంగ్రెస్ జోక్యం చేసుకుందని అన్నారు.
Read Also: Sakshi Agarwal: డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని..
శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోకి జోడో యాత్ర ప్రవేశించింది. రాష్ట్రంలో జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రక్షించిందని అన్నారు. శనివారం డియోఘర్‌లోని ప్రసిద్ధ బాబా బైద్యనాథ్ థామ్ వద్ద ప్రార్థనలు చేశారు. అక్కడే ర్యాలీలో ప్రసంగించారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన యాత్ర శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ నుంచి పాకూర్ జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించింది. మొత్తంగా 67 రోజుల్లో 6,713 కిలోమీటర్లు ప్రయాణించి, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా మార్చి 20న ముంబైలో యాత్ర ముగియనుంది.
మరోవైపు జార్ఖండ్ రాజకీయాల్లో మాజీ సీఎం హేమంత్ సొరెన్ అరెస్టుతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన తర్వాత జేఎంఎం ఎమ్మెల్యే చంపై సొరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష ఉంది. ఇప్పటికే జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు ప్రభావితం కాకూడదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంప్ పెట్టారు.