వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా చమురును అమెరికాకు అప్పగిస్తారని.. దాదాపు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. అంటే దీనిని బట్టి వెనిజులా చమురును అమెరికా తన స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Andhra Sweet Corn Vada: క్రిస్పీ.. క్రిస్పీగా ఆంధ్రా స్టైల్‌లో స్వీట్ కార్న్ వడ.. రుచి అద్భుతం.. తయారీ ఈజీ!
ఇదిలా ఉంటే వెనిజులాకు సంబంధించిన చమురు కంపెనీల కార్యనిర్వాహకులతో శుక్రవారం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్సాన్, చెవ్రాన్, కోనోకోఫిలిప్స్ ప్రతినిధులు హాజరుకానున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై ప్రతినిధులతో ట్రంప్ చర్చిస్తారని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తి వెల్లడించారు.
గత శనివారం వెనిజులాపై అమెరికా సైన్యం దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చారు. అనంతరం డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే అమెరికా సైనిక దాడిలో 32 మంది వెనిజులా భద్రతా అధికారులు చనిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: మోడీతో నేను బాగానే ఉన్నా.. ఆయనే నాతో సంతోషంగా లేరు.. ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు