Bangladesh: మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.. బంగ్లాలో ఏం జరుగుతోంది.?
- బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు కీలక పరిణామం..
- జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్‌ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది. యావో వెన్‌తో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ లియు యుయిన్, పొలిటికల్ డైరెక్టర్ జాంగ్‌జింగ్‌తో పాటు చైనీస్ అధికారులు ఉన్నారు. ఇరు దేశాల ప్రతనిధులు చైనా, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అంశాల గురించి చర్చించారు.
చైనా, బంగ్లాదేశ్ మధ్య చారిత్రాత్మక స్నేహం ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి చాలా ముఖ్యమైందని జమాతే ఇస్లామీ పేర్కొంది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఈ సమావేశం జరగడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది. గత సంవత్సరం విద్యార్థి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించిన యువజన పార్టీ ఎన్‌సిపితో పొత్తు పెట్టుకుని జమాతే ఇస్లామీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇటీవల జగన్నాథ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
Read Also: India-China: “షక్స్‌గామ్ వ్యాలీ మాదే, భారత్‌ది కాదు”.. చైనా ప్రకటన..
గతేడాది షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం చైనా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లింది. ఇప్పుడు రెండోసారి జమాత్ నేతలతో చైనా అధికారులు భేటీ అయ్యారు. బంగ్లాదేశ్‌లోని చైనా రాయబారి యావో వెన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గత దశాబ్ద కాలంలో బీఎన్‌పి, జమాతే ఇస్లామీతో చైనా సంబంధాలు కొనసాగించలేకపోయిందని, ఇప్పుడు వారితో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మతోన్మాద జమాతే ఇస్లామీకి, పాకిస్తాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఈ పార్టీ నేతలు పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవాలని కోరుకున్నారు. భారత్ అంటే విషం వెళ్లగక్కే జమాతే ఇస్లామీ పార్టీ అధినేత ఇప్పుడు చైనా రాయబారితో భేటీ కావడం, భారత్‌కు ఆందోళన కలిగించే పరిణామాలు. షేక్ హసీనా సమయంలో భారత అనుకూల వైఖరి ఉండగా, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకతను యూనస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ భారత వ్యతిరేక శక్తులైన పాక్, చైనాలకు ఆటస్థలంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!