China: భారత మీడియా తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వుని ఇంటర్వ్యూ చేయడాన్ని డ్రాగన్ కంట్రీ చైనా తప్పుబడుతోంది. ఇది ‘వన్ చైనా’ విధానానికి విరుద్ధమని చెప్పింది. జోసెఫ్ వు తన ఇంటర్వ్యూలో ‘తైవాన్ స్వాతంత్ర్యం’ కోసం వాదించడానికి ఇండియా వేదిక కల్పించిందని భారత్ తోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. అయితే, చైనా వ్యాఖ్యలపై తైవాన్ ఘాటుగానే స్పందించింది. భారత్, చైనా స్వేచ్ఛాయుతమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యయుత మీడియా కలిగిన దేశాలని, చైనాకు భారత్ కానీ, తైవాన్ కానీ తోలుబొమ్మలు కావని చెప్పింది.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. భారత్‌లో నిరుద్యోగం పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగా ఉందని, భూటాన్ కన్నా వెనకబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 40 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకుందని, పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లో రెండింతల నిరుద్యోగం ఉందని అన్నారు.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియ సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్బుక్, టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని తీర్మానంలో కోరారు. మార్చి 11తో సెనేటర్‌గా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో టాంగీ ఈ తీర్మానాన్ని తీసుకురావడం గమనార్హం.
Pakistan: అణు కార్యక్రమాలు, బాలిస్టిక్ క్షిపణుల నిర్మాణానికి దోహదపడే సరుకుతో పాకిస్తాన్ వెళ్తున్న ఓడను భారత అధికారులు ముంబైలోని నవషేవా పోర్టులో అడ్డుకున్నారు. ఈ సరకు చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్నట్లు తేలింది. అయితే, దీనిపై పాకిస్తాన్ స్పందించింది. వాస్తవాలను తప్పుడుగా చూపిస్తోందని పాక్ విదేశంగా కార్యలయం ఆదివారం పేర్కొంది. జనవరి 23న చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న ఓడ CMA CGM అట్టిలాను ముంబైలోని నవా షెవా పోర్ట్‌లో నిలిపివేశారు. ఈ ఓడలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) యంత్రాన్ని డిఫెన్స్…
Man Kills Wife: ఢిల్లీలో దారుణం జరిగింది. 55 ఏళ్ల వ్యక్తి భార్యను హత్య చేసి, నాలుగు రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లో జరిగింది. ఇంట్లో నుంచి భరించలేదని దుర్వాసన రావడంతో నిందితుడు భరత్ సింగ్ ఇంటి ముందు కూర్చుని తన భార్యను చంపినట్లు కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన పొరుగింటి వారితో తన భార్యను చంపేశానని, పోలీసులను పిలవాలని నిందితుడు కోరాడు.
Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలో రామేశ్వరం కేఫ్ పేలుడు దేశంలో సంచలనంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. నిందితుడు టిఫిన్ చేసేందుకు వచ్చాడనే ముసుగులో బాంబు ఉన్న బ్యాగ్‌ని అక్కడే వదిలేసి వెళ్లాడు. టైమర్ సహాయంతో బాంబు పేల్చినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ కేసులో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ బాంబును వాడినట్లు తేలింది. ఈ కేసును బెంగళూర్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో మారణహోమం జరిగింది. మూడు గ్రామాలపై వారం రోజుల క్రితం జరిగి దాడుల్లో 170 మందిని కిరాతకంగా చంపేసిటనట్లు ప్రాంతీయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 25న యటెంగా ప్రావిన్స్‌లోని కొమ్సిల్గా, నోడిన్ మరియు సోరో గ్రామాలపై జరిగిన దాడులకు సంబంధించి నివేదికలు అందాయని, దాదాపుగా 170 మందికి మరణశిక్ష విధించారని అలీ బెంజమిన్ కౌలిబాలీ చెప్పారు. ఈ ఘటనపై తమ కార్యాలయం విచారణకు ఆదేశించిందని చెప్పారు. బాధితుల్లో డజన్ల కొద్దీ మహిళలు, చిన్న పిల్లలు…
Pawan Singh: బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు తొలి జాబితా కొన్ని వివాదాలకు కారణమవుతోంది. విద్వేష వ్యాఖ్యలు చేసే పలువురు నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్యంగా టార్గెట్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆ పార్టీకి దెబ్బపడింది. భోజ్‌పురి యాక్టర్, సింగర్ పవన్ సింగ్‌ని బెంగాల్ అసన్సోల్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థికిగా నిన్న బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది సమయానికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు పవన్ సింగ్ టార్గెట్‌గా పలు విమర్శలు చేశారు.
Shehbaz Sharif: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానిగా రెండోసారి షహజాబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీల ఉమ్మడి సర్కారుకు షహబాజ్ నాయకత్వం వహించనున్నారు. ఈ రోజు ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశమైంది. మొత్తం 336 మంది సభ్యుల ఓట్లలో షహజాబ్ 201 ఓట్లు పొందారు. మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చెందిన ఒమర్ అయూబ్ ఖాన్ కేవలం 92 ఓట్లను మాత్రమే సాధించారు.
జార్ఖండ్‌లో స్పానిష్ యువతిపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్ టూరిస్ట్ అయిన మహిళపై అతని భాగస్వామిపై దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. నిందితులను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు. ఈ పీడకలకు సంబంధించి స్పానిష్ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ముఖం నిండా గాయాలతో భయానక అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ ఎవరూ కోరుకోనిద మాకు జరిగింది. ఏడుగురు వ్యక్తులు నన్ను రేప్ చేశారు’’ అంటూ బాధ…