Ashwini Vaishnaw: రాబోయే కొన్ని ఏళ్లలో భారతదేశంలో కనీసం 1000 కొత్త తరం ‘అమృత్ భారత్ ట్రైన్’లను తయారు చేస్తో్ందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయని శనివారం తెలిపారు. వందేభారత్ రైళ్ల ఎగుమతిపై ఇప్పటికే పనులు ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో తొలి ఎగుమతి జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో రైల్వేల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన(చినాబ్ వంతెన), మొదటి అందర్…
BJP: బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో వెళ్తోంది. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, రాజీవ్ చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింథియా, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి ప్రముఖ నేతలు తొలి లిస్టులోనే ఉన్నారు.
BJP 1st List: లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు 34 మంది మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా లోక్‌సభ బరిలో నిలిచారు. తొలి జాబితాలో 28మంది మహిళలతో పాటు 50 ఏళ్ల లోపు 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన 57 మందికి చోటు దక్కింది. మొత్తం 195 మందిలో 51 మంది ఉత్తర్ ప్రదేశ్…
Covid vaccine: ఇటీవల కాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్లారిటీ ఇచ్చారు. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ మాండవియా శనివారం తెలిపారు. ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎవరికైనా స్ట్రోక్ వచ్చినట్లయితే, అది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అనే భావిస్తున్నారు, గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కానది ఐసీఎంఆర్…
BJP: బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. జయంత్ సిన్హా మాజీ కేంద్రమంత్రి పనిచేశారు, హజారీబాగ్‌కి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాను భారత్, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఎంసీని అవినీతి పార్టీగా ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ నిర్దేశించారు.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎతో కలిసి ఉంటానని, ఎక్కడికి వెళ్లనని నితీస్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ప్రధాని మోడీ చిరునవ్వు చిందించారు. బీహార్ ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగం సభలో నితీష్ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఇంతకముందు బీహార్ వచ్చారు, కానీ నేను మీతో లేను, ఇప్పుడు నేను మీతో ఉన్నారు, నేను ఇక ఎక్కడి వెళ్లనని మీకు హామీ ఇస్తున్నా’’ అని…
Google: సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్‌లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్‌ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్‌లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం.
26/11 Mumbai Attack: 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) ఉగ్రసంస్థ టెర్రిరిస్ట్ ఆజం చీమా(70) పాకిస్తాన్లో మరణించినట్లు తెలుస్తోంది. 2008లో ముంబైపై ఉగ్రదాడిలో ఇతను కీలకంగా వ్యవహిరంచాడు. 70 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండె పోటుతో మరనించాడు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్‌గా ఉన్న చీమా 26/11 ముంబై ఎటాక్స్, జూలై 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు.
Breaking News: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.