Rameshwaram Cafe: సీసీటీవీలో భయానక పేలుడు దృశ్యాలు.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rameshwaram Cafe: బెంగళూర్‌లో ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి రెస్టారెంట్‌లో బ్యాగ్ వదిలిసి వెళ్లాడు. అందులో ఉన్న బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.
Read Also: Operation Valentine OTT: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’.. ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Also Read
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
ఈ భయంకర పేలుడుకు సంబంధించిన దృశ్యాలు కేఫ్‌లోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు మధ్యాహ్నం లంచ్ చేసే సమయంలో ముష్కరుడు బాంబు పెట్టినట్లు తెలుస్తోంది. అకాస్మత్తుగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. చాలా మంది భయంలో బయటకు పరుగులు తీశారు. గాయపడిన వ్యక్తులు నేలపై పడి ఉండటం సీసీటీవీలో గమనించవచ్చు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది గాయపడ్డారు. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోంమంత్రి సంఘటనా స్థలానికి వెళ్తున్నట్లు సీఎం చెప్పారు. మరోవైపు ఈ కేసును ఎన్ఐఏ విచారించే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించే పనిని ప్రారంభించారు. కేఫ్ పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు.
CCTV footage of Bangalore #RameshwaramCafe blast.
Looks like much more serious than what was being told. pic.twitter.com/pARMOJJLK5
— Sanjeevee sadagopan (@sanjusadagopan) March 1, 2024
Explosion at Bengaluru's Rameshwaram Cafe caught on CCTV camera
(Video source: Police) pic.twitter.com/lhMtK3rsOs
— ANI (@ANI) March 1, 2024
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!