Udhayanidhi Stalin vs Annamalai: మీరు డీఎంకేని టచ్ చేయలేరు.. నువ్వో విఫల నటుడివి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stalin vs Annamalai: తమిళనాడులో డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై కూడా అంతే ధీటుగా స్పందించడంతో ఇరు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తమిళనాడు రాష్ట్రం పన్నులుగా చెల్లించిన ప్రతీ రూపాయిలో కేంద్రం తిరిగి 28 పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ‘28 పైసా మోడీ’ అంటై ప్రధానిని విమర్శించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్న షెహబాజ్ షరీఫ్..
Also Read
రాష్ట్రంలో తమ డీఎంకే పార్టీని బీజేపీ ముట్టుకోలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుపొందలేదని ఛాలెంజ్ చేశారు. తమిళనాడు చుట్టూ తిరుగుతున్న మోడీ, ఎప్పుడూ చూసినా అబద్దాలు చెబుతున్నారని, డీఎంకేని నాశనం చేస్తానమని గత 60-70 ఏళ్లుగా చెబుతున్నారని, ప్రధాని మాత్రమే కాదు మీ తాత వచ్చినా డీఎంకేని టచ్ చేయలేరని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. వరదలు, తుఫానుల సమయంలో ప్రధాని తమిళనాడుకు రారని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తారని ఎద్దేవా చేశారు.
ప్రధానిపై విమర్శలకు గానూ ఉదయనిధిపై అన్నామలై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ ‘విఫలమైన నటుడు’ అని పిలిచారు.తండ్రి, తాత పేర్లతో రాజకీయాల్లో నిలదొక్కుకుని మంత్రి అయ్యారని, ప్రధాని కాలి గోరుకు ఉన్న మురికి కూడా ఆయన సమానం కాదని, తన కుటుంబ పేరుతో రాజకీయాల్లోకి వచ్చాడని, అతను ఏదైనా సామాజిక సేవ చేశాడా.?? అని ప్రశ్నించారు. స్టాలిన్, కరుణానిధి అనే పేర్లు లేకుంటే ఆయన ఎవరని అన్నామలై ప్రశ్నించారు.
- Tags
- bjp
- DMK
- K Annamalai
- PM Modi
- Tamil Nadu
తాజావార్తలు
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!