Rahul Gandhi: ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొంటున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ గాంధీ కాన్వాయ్ మధ్యప్రదేశ్ సారంగపూర్ వెళ్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ‘‘జై శ్రీరామ్, మోడీ’’ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసేందుకు కాన్వాయ్ ఆపివేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆయనకు బంగాళాదుంపలు ఇవ్వడం వీడియోలో కనిపించింది. బంగాళాదుంపలను తీసుకుని దానికి బదులుగా బంగారం ఇవ్వాలని రాహుల్‌ని కోరారు.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మరోసారి భారత్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మే 10 తర్వాత భారత సైనిక సిబ్బంది, పౌర దుస్తుల్లో ఉణ్న వారు కూడా తమ దేశంలో ఉండరాదని హెచ్చరించారు. మాల్దీవుల్లో భారత సైనిక సిబ్బందిని , పౌర సిబ్బంది మాల్దీవులకు చేరుకున్న వారంలోపే ముయిజ్జూ నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత సైనిక సిబ్బంది మాల్దీవుల నుంచి ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి 10 లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని భావించాయి. అయితే, తాజాగా…
Pakistan: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని వివరించారు కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్. జాతీయ అసెంబ్లీని నడిపేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చి 2030 నాటికి జీ-20 సభ్యత్వాన్ని సాధించేలా చేస్తానని ప్రమాణం చేశారు.
BJP MLA: డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా శనివారం ప్రధాని నరేంద్రమోడీకి తన సొంత రక్తంతో లేఖ రాశారు. గూర్ఖాల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గూర్ఖా సంఘం సమస్యలపై ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 10, 2014న సిలిగురి సమీపంలో ఖప్రైల్‌లో జరిగిన బహిరంగ సభ్యలో ప్రధాని మోడీ ఇచ్చి హామీలు ఇప్పటికీ నెరవేరలేదని లేఖలో హైలెట్ చేశారు.
Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్నర్లను మార్చడం "నైతికం"గా సరికాదు, కానీ రిలేషన్షిప్లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.
UK: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా దేశాల నుంచి రాడికల్ ఇస్లామిక్ట్ దృక్పథం కలిగిన మత విద్వేష బోధకులు రాకుండా యూకే బ్యాన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని యూకే మీడియా ఆదివారం నివేదించింది. బ్రిటన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో అక్కడి రిషి సునాక్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది. విదేశాల నుంచి వచ్చే అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులను గుర్తించడానికి అధికారులను నియమించారు. తద్వారా వారికి వీసా హెచ్చరికల జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది.…
Lalu Prasad Yadav: బీహార్ పాట్నా వేదికగా ఈ రోజు రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హిందువు కాదని అన్నారు.
Harsh Vardhan: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత డాక్టర్ హర్ష వర్ధన్ తన మూడు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. నిన్న బీజేపీ విడుదల చేసిన 195 ఎంపీ అభ్యర్థుల జాబితాలో హర్ష్ వర్ధన్ పేరు లేదు. ప్రస్తుతం ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన స్థానాన్ని ప్రవీణ్ ఖండేల్ వాల్కి కేటాయించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 69 ఏళ్ల హర్ష్ వర్ధన్ నేనెప్పుడూ స్వయం సేవక్‌నే అంటూ ‘‘హృదయంలో స్వయంసేవక్’’…
Pakistan: పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 48 గంటల్లో కురిసిన వర్షాలకు ఆ దేశంలో 37 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. పాక్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడటం జరుగుతోంది. ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్ తవ్రంగా ప్రభావితం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ప్రావిన్సులో గురువారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాల కారణంగా 27 మంది మరణించారని, వీరిలో ఎక్కువగా చిన్నారులు ఉన్నారని ప్రావిన్షియల్ డిజాస్టర్…
PM Modi: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోడీ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు. సెమికండక్టర్ ప్రాజెక్టులతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, హర్యానాలో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించనున్నారు.