Vande Bharat Trains: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చని సెమీ హైస్పీడ్ రైల్ ‘‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’’ తరుచుగా దాడులకు గురవుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు రైలు ప్రయాణిస్తున్న సమయంలో రాళ్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. తాజాగా నైరుతి రైల్వే(ఎస్డబ్ల్యూఆర్) జోన్ గుండా వెళ్తున్న 4 వందేభారత్ ట్రైన్లపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని అధికారులు మంగళవారం తెలిపారు. ఈ దాడుల్లో ప్రయాణికులకు, సిబ్బంది…
Google: గూగుల్ యూటర్న్ తీసుకుంది. ఇటీవల రుసుము చెల్లించలేదని చెబుతూ పలు భారతీయ యాప్‌లను తొలగించింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో తొలగించిన యాప్‌లను గూగుల్ మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ప్రభుత్వం నుంచి, లోకల్ ఇంటర్నెట్ స్టార్టప్స్ నునంచి తీవ్ర విమర్శలు రావడంతో తన వైఖరిని మార్చుకుంది. మ్యాట్రిమోనీ.కామ్ వంటి ప్రసిద్ధ యాప్‌లో సహా 100 కంటే ఎక్కువ భారతీయ యాప్‌లను గూగుల్ శుక్రవారం తొలగించింది.
India Not A Nation: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి డీఎంకే సీనియర్ నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాజా.. తాజాగా ‘‘ఇండియా ఒక దేశం కాదు’’ అని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
సిలికాన్ సిటీ బెంగళూర్ వేసవి కాలం పూర్తిగా రాకముందే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీటి కొరతను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని డ్రై ప్లేసెస్‌కి నీటిని సరఫరా కోసం ప్రైవేట్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రోజూవారీ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే ప్రైవేట్ అపార్ట్మెంట్ల సమస్యను మరింత తీవ్రతరం చేసింది. కనకపురా రోడ్‌లోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ నీటి సంక్షోభం నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ…
West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్ని సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక ఆరోపణలు, భూకబ్జా, రేషన్ బియ్యం కుంభకోణాలనికి పాల్పడినట్లు ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్కి సంబంధించిన మెటీరియల్ సీబీఐకి అందించడానికి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగాల్ పోలీసులకు గడువు విధించింది.
India: ఇజ్రాయిల్-హమాస్ పోరు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయులకు మంగళవారం కీలక సూచనలను జారీ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత, ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ ప్రస్తుతం భద్రతా పరిస్థితులు, స్థానిక భద్రతా సలహాల దృష్ట్యా దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, సందర్శించే వారు ఇజ్రాయిల్ లోని సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలని సూచించారు. రాయబార కార్యాలయం వారితో టచ్‌లో ఉంది. ఇజ్రాయిల్ అధికారులు మా పౌరులందరికీ భద్రత కల్పించాలి’’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్…
Haiti: కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
China: డ్రాగన్ కంట్రీ చైనా రక్షణ బడ్జెట్‌ని పెంచింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, 2024 రక్షణ వ్యయాన్ని పెంచుతామని చైనా మంగళవారం ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) వార్షిక సమావేశ ప్రారంభంలో గత ఏడాది కన్నా 7.2 శాతం పెరుగుదలను ప్రకటించింది. 2024లో రక్షణ బడ్జెట్‌ని 1.665 ట్రిలియన్ యువాన్లు ($231.4 బిలియన్లు) ఖర్చు చేయనుంది.
Iran: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ఇటీవల కాలంలో ఉరిశిక్షలను విధించడం ఎక్కువ చేసింది. ఇస్లామిక్ చట్టాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఇరాన్ మరణశిక్షలను ఎక్కువగా అమలు చేస్తుండటంపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 834 మందికి మరణశిక్ష విధించిందని, 2015 తర్వాత ఇదే అత్యధికమని హక్కుల సంఘాలు మంగళవారం తెలిపాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇరాన్ ఉరిశిక్షల సంఖ్య 2022 నాటికి 43 శాతం పెరిగింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడిన కర్ణాటకకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. షోరాపూర్ తాలుకాలోని రంగంపేటకు చెందిన మహ్మద్ రసూల్ కద్దారే అనే వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని యాద్గీర్ జిల్లా ఎస్పీ జి సంగీత ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతుందని, ప్రస్తుతం అన్ని విషయాలు వెల్లడించలేదని చెప్పారు. షోరాపూర్ పోలీసులు కద్దరేపై ఐపీసీ సెక్షన్లు 505 (1) (బి), 25 (1) (బి) మరియు ఆయుధాల చట్టం…