Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. హమీర్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాధితురాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాన్పూర్‌లోని ఘతంపూర్ ప్రాంతంలో ఇసుక బట్టీలో సాహూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి కూతురు, మేనకోడలు కూడా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికలకు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని…
రూ. 820 కోట్ల విలువైన యూకో బ్యాంక్ IMPS లావాదేవీల అనుమానాస్పద ట్రాన్స్ క్షన్స్ సంబంధించిన కేసులో సీబీఐ రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లోని 67 ప్రాంతాల్లో భారీ సోదాలు నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్ 10-13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి IMPS అంతర్గత లావాదేవీల ద్వారా 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి తప్పుగా పోస్ట్ చేయబడ్డాయని యూకో బ్యాంక్ ఫిర్యాదు చేసింది.
Indian Air Force: యువతికి అన్నయ్య లేని లోటును తీర్చారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండోలు. దగ్గరుండీ యువతి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. అన్నీ తామై ఎలాంటి లోటు రాకుండా పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తన అన్నయ్య విధి నిర్వహణలో వీరమరణం పొందినప్పటికీ, ఆయన లేని లోటు గుర్తుకు రాకుండా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. 2017లో బీహార్‌లో మరణించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దళ కమాండో సోదరి వివాహానికి గరుడ యూనిట్‌కి చెందిన కమాండోలు హాజరై పెళ్లి తంతును నిర్వహించారు.
NDA: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కి చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈమేరకు చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరిలోనూ ఇదే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 15 ఏళ్ల తర్వాత బీజేడీ ఎన్డీయే కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసిపోటీ చేస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారికంగా పొత్తుపై ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు పార్టీల నేతలు మాత్రం పొత్తుపై సంకేతాలు ఇస్తున్నారు. సీట్ల పంపకంలో చర్చలు విఫలమైన తర్వాత…
దేశ సరిహద్దుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అన్నారు. ఎన్డీటీవీ తొలి డిఫెన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మేము అన్ని సమయాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. శాంతి సమయంలో కూడా మేము సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ‘‘భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే మా బలగాలు ధీటుగా సమాధానమిస్తాయి. మేం ఏ దేశంపైనా దాడి చేయలేదు, ఎవరి భూమిలోనూ ఒక్క అంగుళం ఆక్రమించలేదు. కానీ, ఎవరైనా…
China: మాల్దీవులు, భారత్‌ని కాదని డ్రాగన్ దేశం చైనాతో సంబంధాలను పెంచుకుంటోంది. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఆ దేశంలో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. తాజాగా మాల్దీవులు, చైనాతో రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జరిగిన తర్వాతి రోజే ముయిజ్జూ భాతర వ్యతిరేక స్వరం పెంచుతూ.. భారత్ సైనికులే కాకుండా, పౌర దుస్తుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు వెళ్లిపోవాల్సిందే అని ఆదేశించాడు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి దేశ ప్రజల్లో తిరుగులేని ఆమోదం ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. Ipsos IndiaBus పీఎం అప్రూవల్ రేటింగ్ సర్వేలో పీఎం మోడీకి దేశవ్యాప్తంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే ఫిబ్రవరి 2024లో జరిగింది. గతేడాది సెప్టెంబర్ నెల సర్వేతో పోలిస్తే ఆమోదం 65 శాతం నుంచి 10 శాతం పెరిగి 75 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. కొన్ని నగరాల్లో మోడీ పనితీరుకు ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. మొత్తం నాలుగు జోన్ల వారీగా…
Himanta Biswa Sarma: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ.. అతను హిందువు కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాలూ తీరును ఎండగట్టారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తెలిసిన హిందూ సంస్కృతిని మరిచిపోయాడని ఎద్దేవా చేశారు. ఇంతకాలం హిందూ వ్యతిరేకిగా ఉండటమే అందుకు కారణం కావచ్చని అన్నారు. అస్సాంలోని బొంగైగావ్‌లో మంగళవారం […]
బెంగళూర్‌లో దారుణం జరిగింది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. ఈ సంఘటన ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జరిగింది. 35 ఏళ్ల మహిళ, 37 ఏళ్ల తన భర్తపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న అతను భార్యను పక్కకు నెట్టేయడంతో బతికిపోయాడు. గాయాలతో ఉన్న అతను ఆస్పత్రికి వెళ్లేందుకు పొరుగువారి సాయం తీసుకున్నాడు. మెడికో లీగల్ కేసు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
Swiggy: ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీలు చేయనుంది. ఈ మేరకు స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఆరు నెలల్లో 59కి పైగా రైల్వే స్టేషన్లలో తమ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. మార్చి 12 నుంచి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆహారాన్ని డెలివరీ చేయనున్నారు. IRCTC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రోహిత్ కపూర్ మధ్య…