PM Modi: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరించనున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోడీ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు. సెమికండక్టర్ ప్రాజెక్టులతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, హర్యానాలో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించనున్నారు.
ప్రధాని పర్యటించబోతున్న 12 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ ఉన్నాయి. మార్చి 4న తెలంగాణలోని ఆదిలాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లనున్నారు. ఆ తర్వాత తమిళనాడులోని కల్పక్కంలో భారతీయ నాభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (BHAVINI)ని సందర్శిస్తారు. చెన్నైలో జరిగే బహిరంగ సభకు హాజరై, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు. మార్చి 5న, ప్రధాని తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగే సభలో పాల్గొంటారు.
Read Also: Rahul Gandhi: భారతదేశంలో నిరుద్యోగం పాకిస్తాన్ కన్నా ఎక్కువగా ఉంది..
సంగారెడ్డి తర్వాత ప్రధాని ఒడిశాలోని ఛండీఖోలే, జాజ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారు. మార్చి 6న పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్ బెట్టియాకి వెళ్లి ఆ తర్వాత మార్చి 7న కాశ్మీర్ శ్రీనగర్‌లో పర్యటిస్తారు. మార్చి 8న అస్సాంకి, మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్‌కి వెళ్లనున్నారు. మార్చి 10న ఉత్తర్ ప్రదేశ్ ఆజంగఢ్, మార్చి 11న ఢిల్లీలోని పూసాలో పర్యటిస్తారు. మార్చి 12న గుజరాత్ సబర్మతిలో పర్యటించి ఆ తర్వాత రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్‌లో పర్యటిస్తారు. మార్చి 13న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్ మరియు అస్సాంలో మూడు సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో షెడ్యూల్ ముగుస్తుంది.