UK: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా దేశాల నుంచి రాడికల్ ఇస్లామిక్ట్ దృక్పథం కలిగిన మత విద్వేష బోధకులు రాకుండా యూకే బ్యాన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని యూకే మీడియా ఆదివారం నివేదించింది. బ్రిటన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో అక్కడి రిషి సునాక్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది. విదేశాల నుంచి వచ్చే అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులను గుర్తించడానికి అధికారులను నియమించారు. తద్వారా వారికి వీసా హెచ్చరికల జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది. కొత్త ప్లాన్ ప్రకారం.. లిస్టులో ఉన్న వారు ఆటోమేటిక్‌గా యూకేలోకి ప్రవేశించకుండా నిరాకరించబడుతారు.
Read Also: Balagam : బలగం సినిమాకు సంవత్సరం..ఆసక్తికర ట్వీట్ చేసిన దర్శకుడు వేణు..
దేశంలో ప్రజాస్వామ్యం, బహుల విశ్వాసాల విలువలు తీవ్రవాద ముప్పులో ఉన్నాయని ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్ 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇక్కడి విలువలను తక్కువగా చూస్తున్న వ్యక్తులు ఈ దేశానికి రాకుండా చర్యలు తీసుకుంటామని శుక్రవారం తన ప్రసంగంలో చెప్పారు. వీసాలపై ఉన్న వారు నిరసనలపై ద్వేషాన్ని రెచ్చగొట్టాలని లేదా ప్రజల్ని భయపెట్టాలని ఎంచుకుంటే ఇక్కడ ఉండకుండా వారి హక్కుల్ని మేం తొలగిస్తామని హోం సెక్రటరీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయిల్-హమాస్ ఘర్షణకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేవారు తమ నిరసనలను తీవ్రవాదులు హైజాక్ చేయకుండా చూసుకోవాలని సూచించారు. విభజన శక్తులను ఎదుర్కోవడానికి , ద్వేషానికి వ్యతిరేకంగా మనమందరం కలిసి నిలబడాల్సిన సమయం వచ్చిందని, మనల్ని ముక్కలు చేసే అతివాదులను మనం ఎదుర్కోవాలని అని రిషిసునాక్ అన్నారు.
లండన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అక్కడి పోలీసులు 12 మందిని శనివారం అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వీరికి అనుకూలంతా పాలస్తీనా అనుకూల నిరసనల కోసం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. వామపక్ష, ఇస్లామిక్ తీవ్రవాదంపై ఆ దేశ మంత్రులకు ప్రభుత్వం స్వతంత్ర సలహాదారు లార్డ్ వాల్నే హెచ్చరించారు.