Pakistan: పాకిస్తాన్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 48 గంటల్లో కురిసిన వర్షాలకు ఆ దేశంలో 37 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. పాక్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడటం జరుగుతోంది. ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ తవ్రంగా ప్రభావితం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ప్రావిన్సులో గురువారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాల కారణంగా 27 మంది మరణించారని, వీరిలో ఎక్కువగా చిన్నారులు ఉన్నారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది.
Read Also: PM Modi: దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పర్యటన.. 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో కార్యక్రమాలు..
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్, స్వాత్, లోయర్ దిర్, మలాకండ్, ఖైబర్, పెషావర్, ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ మరియు లక్కీ మార్వాట్ సహా పది జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ప్రాంత ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ మాట్లాడుతూ.. బాధితులను ఒంటరిగా వదిలిపెట్టమని, వారికి పరిహారం ఇస్తామని ప్రకటించారు. బలూచిస్తాన్ గ్వాదర్ తీర ప్రాంత పట్టణాన్ని వరదలు ముంచెత్తడంతో ఐదుగురు మరణించారు. గ్వాదర్ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నిరాశ్రయులయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఉత్తర గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో వర్షాల కారణంగా మంచు, కొండచరియలు విరిగిపడటంతో పాకిస్తాన్ చైనాను కలిపే రహదారి చాలా చోట్ల దెబ్బతింది. పర్యాటకులు ఈ ప్రాంతానికి వెళ్లొద్దని అధికారులు సూచించారు. 2022లో పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఆ సమయంలో 1800 మంది మరనించారు. 3.3 కోట్ల మంది ప్రభావితమయ్యారు. దాదాపుగా 80 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ విపత్తు నుంచే ఇప్పటికీ పాకిస్తాన్ కోలుకోవడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే పాక్ ఆర్థిక సంక్షోభానికి ఈ వర్షాలు కూడా కారణమయ్యాయి.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!