Viral Video: డ్రగ్స్‌పై ఓ పోలీస్ ఉన్నతాధికారిని స్టూడెంట్ ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హర్యానాలోని సోనిపట్‌లో పోలీసులు నిర్వహించిన డ్రగ్ డి అడిక్షన్ ప్రచారంలో విద్యార్థి పోలీసుల్ని నిలదీశారు. డ్రగ్స్ అంత సులువుగా దొరికేలా చేస్తున్నారని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు.
Maldives: మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ వచ్చిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు తమ టికెట్స్, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
Sardar Ramesh Singh Arora: ముస్లిం రిపబ్లిక్‌గా ఉన్న పాకిస్తాన్ దేశంలో ఒక హిందూ, సిక్కు, క్రిస్టియన్ మైనారిటీలు అత్యున్నత పదవులను ఆక్రమించడం చాలా అరుదు. తాజాగా సర్దార్ రమేష్ సింగ్ అరోరా అనే వ్యక్తి పాకిస్తాన్ దేశంలోనే తొలి సిక్కు మంత్రిగా ఎన్నికయ్యారు. పంజాబ్ ప్రావిన్స్‌లో మైనారిటీ వ్యవహాల మంత్రిగా పనిచేయనున్నారు. రమేష్ సింగ్ అరోరా పాకిస్తాన్ మైనారిటీ నాయకుల్లో శక్తివంతమైన నేతగా ఉన్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) పార్టీకి చెందిన అరోరా ఫిబ్రవరి 8…
Butter chicken: ఇంగ్లాండ్‌కి చెందిన 27 ఏళ్ల వ్యక్తి బటర్ చికెన్ కారణంగా మరణించాడు. దేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందిన ఈ ప్రముఖ వంటకం కారణంగా ఒకరు మరణించాడు. టేక్ అవే నుంచి బటర్ చికెన్ తీసుకెళ్లిన తర్వాత జోసెఫ్ హిగ్గిన్సన్, దాన్ని తింటున్న క్రమంలో తీవ్రమైన ‘అలర్జీ’ బారిన పడ్డాడు. గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లోని బరీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Tamil Nadu: తమిళనాడులో అధికార డీఎంకేతో మిత్రపక్షాల సీట్ల ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మిత్రపక్షాలైన వీసీకే, ఎండీఎంకేలతో సీట్ల సర్దుబాటు పూర్తైంది. రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని మళ్లీ పునారవృతం చేశారు. విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె)కి రెండు సీట్లు కేటాయించగా, ఈ రెండు కూడా రిజర్వ్డ్ సీట్లు. వైకో నాయకత్వంలోని ఎండీఎంకేకు ఒక సీటును కేటాయించారు. దీంతో పాటు 2019లో ఈ పార్టీకి ఒక రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు.
Congress: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందు కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ 5 హామీలను ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్ భన్వారాలో ప్రకటించారు. ఇదే కాకుండా పేపర్ లీక్స్‌పై చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చకచక పనులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అధికారులు పర్యటనలు నిర్వహించారు. ఈ నెల మధ్యలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ తొలి విడతగా 195 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ రోజు తొలి…
Bengaluru water crisis: బెంగళూర్ నగరంలో నీటి కొరత తీవ్రమవుతోంది. ఇప్పటికే ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీటి ట్యాంకర్ల పేరుతో దోపిడి చేసేవారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు జరిమానాలను విధిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పలు గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే నివాసితులు మాత్రం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29) హత్య సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద ఉండాల్సిన వరుడు హత్యకు గురయ్యాడు. గౌరవ్ సింఘాల్‌ని అతని తంండ్రి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తండ్రి రంగలాల్ హత్య చేశాడని, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గౌరవ్ తనను రోజూ తిడుతుండే వాడనే కోపంతో రంగలాల్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో గౌరవ్ అతడి ఇంట్లో అర్థరాత్రి హత్యకు గురయ్యాడు. తెల్లవారితే…
Mahashivratri: రాజస్థాన్ కోటాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుపుతున్న ఊరేగింపులో ప్రమాదం జరిగింది. ఉరేగింపు సమయంలో 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కి గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. గాయపడిన చిన్నారుల్ని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. కొంత మంది చిన్నారులను అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.