Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ దేశ మహిళలపై ప్రశంసలు కురిపించారు. దేశంలో జననాల రేటు పెంచేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల పలుమార్లు రష్యా అధినేత మహిళలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మాతృత్వం, ఆకర్షణ, అందం యొక్క బహుమతులను అందించినందుకు మహిళల్ని ప్రత్యేకంగా వారిని అభినందించారు. మార్చి 8 అనేది సోవియల్ సమయం నుంచి రష్యాలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా ఉంది. స్త్రీల గొప్పతనం గురించి వారి నైపుణ్యాల గురించి గొప్పగా చెప్పబడుతోంది.
Bengaluru Cafe Blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడి కొత్త ఫోటోలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేసింది. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరింది. మార్చి 1న బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లోని కేఫ్‌లో నిందితుడు బ్యాగుల్లో ఐఈడీ బాంబును ఉంచి, టైమర్ సాయంతో పేల్చాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పేలుడు తర్వాత నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.
Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29)ని అతని తండ్రి రంగ్లాల్(54) దారుణంగా హత్య చేశాడు. గౌరవ్ పెళ్లికి కొన్ని గంటల ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులకు విస్తూపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఇంత వరకు కొడుకు తిడుతున్నాడనే కోపంతోనే గౌరవ్‌ని హత్య చేశాడని భావిస్తున్నప్పటికీ, మరో విషయం వెలుగులోకి వచ్చింది. భార్య తనను విడిచిపెట్టిందనే కోపంతోనే కొడుకును పెళ్లి రోజే చంపినట్లు రంగలాల్ పోలీసులకు వెల్లడించారు. ఈ హత్యకు మూడు నాలుగు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు తేలింది.
Congress-DMK: లోక్‌సభ ఎన్నికల తేదీలు ఈసీ విడుదల చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పలు పార్టీల మధ్య పొత్తుల చర్చల్లో వేగం పెరిగింది. తాజాగా తమిళనాడులోని అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్ పూర్తైంది. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)తో కూడా సీట్ల ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీకి 10 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
Hardeep Singh Nijjar: ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. హత్య జరిగిన 9 నెలల తర్వాత ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సీబీసీ న్యూస్ నివేదించింది. 2020లో భారత్ చేత టెర్రరిస్టుగా గుర్తించబడిన నిజ్జర్, జూన్ 18, 2023న గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్య చేయబడ్డాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా నుంచి బయటకు వస్తున్న క్రమంలో దాడి జరిగింది.
Bharat Jodo Nyay Yatra: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమి బలాన్ని చూపేందుకు కాంగ్రెస్ మరోసారి భారీ కార్యక్రమానికి తెరతీసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ మార్చి 17న ముంబైలో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతల్ని మల్లికార్జున ఖర్గే ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల మోడ్‌లో ఉందని, దూకుడుగా ప్రచారం చేస్తామని అన్నారు.
BJP: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ రోజు 39 మందితో తొలిజాబితాను సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ మరోసారి కేరళ లోని వయనాడ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీ గురించి కాంగ్రెస్ రహస్యంగా వ్యవహరిస్తోంది. సోనియా గాంధీ ఈ సారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే చెప్పారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు.
China: చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బోర్డర్లో మరింత మంది సైన్యాన్ని మోహరించింది. అయితే, ఈ పరిణామాలు డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడు పడటం లేదు. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్ మరిన్ని బలగాలను మోహరించడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉపయోగపడేది కాదని చైనా విశ్వసిస్తోదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. చైనాతో వివాదాస్పద సరిహద్దులను మరింత బలోపేతం చేసేందుకు 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.
Congress 1st list: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికే 195 ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 10 రాష్ట్రాల్లోని కొన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసిటట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోక్‌సభ జాబితా 39 మంది అభ్యర్థులతో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తొలి జాబితాలోనే రాహుల్ గాంధీ, భూపేష్ బఘేల్, కేసీ వేణుగోపాల్, శశిథరూర్ వంటి దిగ్గజ…
Bengaluru cafe blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగి వారం గడుస్తోంది. ఇప్పటికీ నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేటను సాగిస్తూనే ఉన్నాయి. నిందితుడికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా కర్ణాటక పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే నిందితుడికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ముసుగు దరించి బూడిద రంగు చొక్క ధరించినట్లు ఈ వీడియోలో చూడవచ్చు.