Congress: తమిళనాడు, పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. సీట్ల షేరింగ్ ప్రకారం మరోసారి డీఎంకే 2019 ఫార్ములాను రిపీట్ చేసింది. మరోసారి కాంగ్రెస్‌కి తమిళనాడులో 9 ఎంపీ స్థానాలను కేటాయించింది. ఇక పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 2019 ఎన్నికల్లో 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ ఆ సమయంలో 9 స్థానాలకు గానూ 8 స్థానాల్లో గెలిచింది.
BJP: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే తాజాగా వెల్లడించింది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లకు చేరువకు వస్తుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం.. ఎన్డీయేకి 358-398 మధ్య సీట్లు వస్తాయని, ఇందులో బీజేపీకి స్వతహాగా 333-363 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పింది.
PM Modi: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలోని టీఎంసీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తమ కుటుంబాల అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తు్న్నాయని విమర్శించారు. శనివారం సిలిగురిలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా టీఎంసీని గద్దె దించే మార్గం తెరవబడుతోందని అన్నారు.
Uttar Pradesh: సోదరి కులాంతర వివాహం చేసుకుందని పగ పెంచుకున్న వ్యక్తి, ఆమె భర్తను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బిజ్నోర్‌లోని చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీరాపూర్ ఖాదర్ గ్రామంలో నిన్న రాత్రి హత్య జరిగింది. బాధితుడిని చాంద్‌పూర్‌లో నివాసం ఉంటున్న బ్రజేష్ సింగ్‌గా గుర్తించారు.
Pakistan: పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో మహ్మద్ ప్రవక్త, ఖురాన్, ఇస్లాంని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే దాన్ని దైవదూషణగా పరిగణిస్తుంటారు. దైవదూషణకు పాల్పడిన వ్యక్తులకు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. వాట్సాప్ సందేశాల ద్వారా దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల విద్యార్థికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. మరో 17 ఏళ్ల యువకుడికి జీవిత ఖైదు విధించింది. మహ్మద్ ప్రవక్త, అతని భార్యలను గురించి కించపరిచే పదాలను కలిగి ఉన్న ఫోటోలు,
Amit Shah: కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేశారని, పేదల కోసం ఏం చేసింది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆరోపించారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన ఓబీసీ మోర్చా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పేదలకు మేలు చేసింద కేవలం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ మాత్రమే అని అన్నారు.
Nabam Tuki: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తు్న్నారు. అరుణాచల్ ప్రదేవ్ మాజీ సీఎం నబమ్ తుకీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను అడ్డుకోలేని నైతిక కారణాలతో టుకీ రాజీనామా చేశారు.
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. మరో వారంలో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత గురువారం లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Karnataka: ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్త ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో రచ్చకు కారణమయ్యాయి. అయితే, తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న స్పందించారు. అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలని శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయం సాధించిన తర్వాత అతని మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
Lok Sabha Elections: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. వారంలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్క భారతదేశమే కాకుండా అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి.