Mahashivratri: రాజస్థాన్ కోటాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుపుతున్న ఊరేగింపులో ప్రమాదం జరిగింది. ఉరేగింపు సమయంలో 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కి గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. గాయపడిన చిన్నారుల్ని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. కొంత మంది చిన్నారులను అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Inter Student: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన, ఇద్దరు పిల్లలికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో ఒకరికి 100 శాతం కాలిన గాయాలయ్యాయి. సాధ్యమైన అన్ని చికిత్సలు అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. ఏదైనా నిర్లక్ష్యం జరిగితే దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించాము’’ అని మంత్రి అన్నారు. గాయపడిన చిన్నారులను పరామర్శించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రి హీరాలాల్ నగర్ ఆసుపత్రికి చేరుకున్నారు.