Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడిని జిమ్‌ట్రైనర్‌గా పనిచేసే గౌరవ్ సింఘాల్గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున అతని ముఖం, ఛాతిపై 15 కొత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. అయితే, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌరవ్ తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
AI Mission: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కృత్రిమ మేధ(AI) టెక్నాలజీపై దృష్టిసారించాయి. భవిష్యత్ కాలంలో టెక్ రంగాన్ని ఏఐ శాసిస్తోందని చెబుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంపై ఆసక్తి చూపిస్తోంది.
Congress: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేయడానికి సమావేశం కాబోతోంది. చత్తీస్‌గఢ్, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈ రాష్ట్రాల్లో 60 సీట్లపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్-మేలో ఎన్నికలు పూర్తి అవనున్నాయి. ఇప్పటికే బీజేపీ 192 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ విషయం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ ఇస్తోంది. కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంకాగాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని ఆ…
USA: గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ధృవాల వద్ద నీరు వేగంగా కరుగుతోంది. ఇదే కొనసాగితే రానున్న కొన్ని ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత పట్టణాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నగరాలు హై రిస్క్‌లో ఉన్నాయి. 2050 నాటికి అమెరికాలోని తీర ప్రాంత నగరాల్లో ప్రతీ 50 మందిలో ఒకరు గణనీయమైన వరదల్ని ఎదుర్కొంటారని విశ్లేషణలు వెల్లడించాయి.
Delhi High Court: భర్తను తన కుటుంబం నుంచి విడిగా జీవించాలని భార్య కోరడం క్రూరత్వానికి సమానమే అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహం అనేది భవిష్యత్తు జీవితంతలో బాధ్యతలను పంచుకోవడమే అని, తన భార్య ఇంటి పనులు చేయాలని భర్త ఆదేశించడాన్ని క్రూరత్వంగా పేర్కొనలేమని కోర్టు చెప్పింది. పెళ్లయిన స్ట్రీని ఇంటి పని చేయమని కోరడం పనిలో సహాయం చేసినట్లు కాదని, ఇది ఆ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతగా పరిగణించబడుతుందని చెప్పింది. తన భార్య క్రూరత్వం కారణంగా తన వివాహాన్ని…
Mamata Banerjee: మహిళలపై లైంగిక వేధింపులతో ఇటీవల బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతం అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్రమోడీ టీఎంసీ పార్టీ, సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
PM Modi: జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కాశ్మీర్ లోయలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పర్యటించారు. ప్రధాని ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్మూకాశ్మీ్ర్’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంకి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, ఈ సభకు ప్రజల్ని బలవంతంగా తరలించారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.
Bengaluru Blast: గత వారం జరిగిన బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు విచారణ వేగవంతమైంది. నిందితుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయాలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఈ కేసులో మంచి సమాచారం లభించిందని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర గురువారం తెలిపారు. పేలుడు జరిగిన తర్వా నిందితుడు తన దుస్తుల్ని మార్చుకుని తుమకూరు పట్టణం వైపు వెళ్లినట్లు తెలిసిందని, బళ్లారి వరకు అతని కదలికలను ట్రేస్ చేసినట్లు మంత్రి ధ్రువీకరించారు.