Congress: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందు కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ 5 హామీలను ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్ భన్వారాలో ప్రకటించారు. ఇదే కాకుండా పేపర్ లీక్స్‌పై చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
తాజాగా కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ వేదికగా ‘‘యువ న్యాయ్’’ పేరుతో 5 వాగ్ధానాలను విడుదల చేసింది.
1) 30 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ
2) యువతకు అప్రెంటిస్‌షిప్ అందించడం
3) పేపర్ లీక్స్‌కి వ్యతిరేకంగా చట్టం
4) గిగ్ ఎకనామీకి సామాజిక భద్రత హామీ
5) యువ రోష్ని: లక్ష మంది యువతకు స్టార్టప్స్ కోసం రూ. 5,000-కోట్ల స్టార్టప్ కార్పస్.
తాము దేశంలోని యువకులందరికీ అప్రెంటిస్‌షిప్ హక్కును కల్పిస్తామని, ప్రతీ గ్యాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్‌కి ఈ హక్కు లభిస్తుందని, వారు ప్రైవేట్ కంపెనీ లేదా ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఏడాది శిక్షణ ఇవ్వబడుతుందని, వారికి ఏడాదికి రూ. 1 లక్ష ఇస్తామని రాహుల్ గాంధీ భన్వారాలో చెప్పారు. డ్రైవర్లు, గార్డులు మరియు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు వంటి గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కోసం ఒక చట్టాన్ని తీసుకువస్తామని, వారికి రక్షణ, పెన్షన్ కోసం సామాజిక భద్రత కోసం కొత్త చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. పేపర్ లీకేజ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐊𝐚 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚: 𝐘𝐮𝐯𝐚 𝐍𝐲𝐚𝐲 pic.twitter.com/LDgjxUmv4Y
— Congress (@INCIndia) March 8, 2024