Viral Video: విద్యార్థులు డ్రగ్ డీలర్లను చేరినప్పుడు, మీ వల్ల ఎందుకు కాదు.? పోలీస్‌ని ప్రశ్నించిన స్టూడెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: డ్రగ్స్‌పై ఓ పోలీస్ ఉన్నతాధికారిని స్టూడెంట్ ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హర్యానాలోని సోనిపట్‌లో పోలీసులు నిర్వహించిన డ్రగ్ డి అడిక్షన్ ప్రచారంలో విద్యార్థి పోలీసుల్ని నిలదీశారు. డ్రగ్స్ అంత సులువుగా దొరికేలా చేస్తున్నారని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు. ‘‘ సార్, డ్రగ్స్ డి-అడిక్షన్ క్యాంపెయిన్‌ని ఇంత పెద్ద కార్యక్రమం చూశాను. కానీ మా యూనివర్సిటీ డ్రగ్స్ వ్యసనానికి అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ రోజు నాలుగు యూనివర్సిటీల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. లాలీపాప్‌లా గంజాయి లేదా ఏదైనా పదార్థం పొందడం సులువుగా మారింది.’’ అని విద్యార్థి చెప్పాడు.
Read Also: Congress: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎంతమందంటే!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్ డ్రగ్స్ వ్యాపారులను గుర్తించగలిగితే, పోలీసులు ఎందుకు చేయలేరు.? పోలీసులు వెనుకబడి ఉన్నారా.? అని ప్రశ్నించారు. నేను ఈ యూనివర్సిటీ విద్యార్థిని, మాకు దగ్గరలో ఉన్న పోలీస్ పోస్టుకు ఎదురుగా గంజాయి దొరుకుతుందని నాకు తెలుసు. ఇది పోలీసులకు తెలియకపోవడం వైఫల్యం అని మీరు అనుకోవడం లేదా..? అని అడిగాడు.
సోనిపట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగినట్లు కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. విద్యార్థి ధైర్యానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అతనిలా ఎక్కువ మంది భారతీయులు ధైర్యం చూపిస్తే మనం నిజంగానే విశ్వగురువు అవుతాము అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, మరొకరు నిజంగా విద్యార్థి చట్టవ్యతిరేక కార్యకలాపాల్ని చూస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందని రాశారు.
We need more students like him! Proves what a sham the Police are pic.twitter.com/uquI1Wt4dY
— Dr Aniruddha Malpani, MD (@malpani) March 7, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!