Trinamool Congress: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు. ఈ రోజు కోల్‌కతాలో జరిగిన టీఎంసీ మెగా బ్రిగేడ్ ర్యాలీలో ఆమె లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు.
PM Modi: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ అజాంగఢ్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని రూ. 34 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించారు. భారతదేశ ప్రగతిపై అసంతృప్తితో, ఎన్నికల ముందు అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్నికల ఎర అని కొందరు అంటున్నారు.. గత నాయకులు ఎన్నికల ముందు పథకాలు, ప్రాజెక్టులను ప్రకటిస్తారు కానీ పూర్తి చేసేవారు కాదని ప్రధాని అన్నారు. గతంలో తాను పునాది వేసిన ప్రాజెక్టులను ప్రారంభించడం దేశ ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు.
Pakistan: తప్పిపోయిన తమ దేశ మత్స్యకారుల జాడను కొనుక్కోవడానికి దాయాది దేశం పాకిస్తాన్, భారత్ సాయాన్ని కోరుతోంది. సింధ్ ప్రావిన్స్ లోని కేతి బందర్ పోర్టు సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో కనీసం 14 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, వీరి ఆచూకీ తెలుసుకోవడానికి భారతదేశం సాయాన్ని కోరాలని పాకిస్తాన్ చట్టసభ సభ్యులు ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్‌ని బలవంతం చేస్తున్నారు.
Brijendra Singh: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీకి షాక్ తగిలింది. హర్యానాలో హిసార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బ్రిజేంద్ర సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను రాజీనమా చేసిన విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ నేను బలవంతపు రాజకీయ కారణాల వల్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. హిసార్ ఎంపీగా తనకు అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు శ్రీ. JP నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు మరణించినట్లుగా అదికారులు వెల్లడించారు. పెషావర్‌లోని బోర్డ్ జబార్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Turtle meat: ఆఫ్రికాలోని జాంజిబార్‌లో విషాదం నెలకొంది. ఆ ప్రాంతంలో అత్యంత రుచికరమైనందిగా భావించే, ప్రజలు ఇష్టంగా తినే తాబేలు మాంసం 9 మంది ప్రాణాలు తీసింది. జాంజిబార్ ద్వీప సమూహంలోని పెంబా ద్వీపంలో సముద్ర తాబేలు మాంసం తినడంతో ఈ మరణాలు సంభవించాయి. మరో 78 మంది ఆస్పత్రి పాలైనట్లు అధికారులు శనివారం తెలిపారు.
UP Crime: ముంబైకి చెందిన ఓ మహిళ ఆరోగ్యం కోసం భూతవైద్యుడిని సంప్రదిస్తే, అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్ నగర్లో జరిగింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మహ్మద్ అష్రఫ్(50)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార బాధిత మహిళకు భూతవైద్యం చేస్తున్నాననే నెపంతో గెస్ట్‌హౌజ్‌లో బంధించాడు.
UN Security Council: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సంస్కరణపై మరోసారి భారత్ గళం విప్పింది. భద్రతా మండలి సంస్కరణలు చేపట్టాలని కోరింది. ఐరాసలో శాశ్వత ప్రతినిధి రుచిక కాంబోజ్ శనివారం న్యూయార్క్‌లో జరిగిన 78వ సెషన్ అనధికార సమావేశంలో యూఎన్ఎస్సీ సంస్కరణ ఆవశ్యతను ఎత్తి చూపారు. అర్ధశతాబ్ధంకి పైగా వీటిపై చర్యలు కొనసాగుతున్నాయని, ప్రపంచం మరియు భవిష్యత్ తరాలు ఇకపై వేచి ఉండలేవని అన్నారు.
Congress: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు సభ్యులు ఉండే ఎలక్షన్ ప్యానెల్లో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా.. తాజాగా గోయెల్ కూడా రాజీనామా చేయడంతో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ప్రస్తుతం ఎన్నికల బాధ్యతంతా ఆయన మీదే ఉంది. అయితే, సీఈసీ రాజీవ్ కుమార్‌తో విభేదాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
CM Pinarayi Vijayan: ఇటీవల కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కే కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ బీజేపీలో చేరారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తూ విమర్శలు గుప్పించారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ప్రభుత్వంలో ఉంటుందని, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కాషాయ పార్టీలో పొత్తు పెట్టుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం త్రివేండ్రం జిల్లా ఎల్డీఎఫ్ ఎన్నికల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.