India-China Border: 2024 ఆనువల్ థ్రెట్ అస్సెస్మెంట్ నివేదికలో భారత్, చైనాల మధ్య సాయుధ పోరాటం తప్పకపోవచ్చని యూఎస్ ఇంటెలిజెన్స్ అభిప్రాయపడింది. భారత సరిహద్దుల వెంబడి చైనా తన పుట్టగొడుగుల్లా గ్రామాలను విస్తరిస్తోందని చెప్పింది. భారత్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దళాల మోహరింపుకు చైనా ప్లాన్ చేస్తుందని, ఇది భారత్‌తో సాయుధ పోరాటానికి దారి తీసే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. వ్యూహాత్మక విస్తరణలో వాస్తవ నియంత్రణ రేఖకు ఎదురుగా తూర్పు, మధ్య ప్రాంతాల్లో చైనా ‘జియోకాంగ్’ గ్రామాల నెట్వర్క్ని విస్తరిస్తోంది.
Shivaraj kumar: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 9న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ భార్య గీత పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అవసరమైనప్పుడు తాను ప్రచారంలో పాల్గొంటా అని ఆయన…
Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో కీలక పరిణామం జరిగింది. ప్రముఖ తమిళనటుడు శరత్ కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసింది. అఖిల ఇండియా సమతువ మక్కల్ కట్చీ(AISMK)ని బిజెపిలో విలీనం చేశారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై సమక్షంలో శరత్ కుమార్, ఆయన పార్టీ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశఐక్యతను పెంపొందించంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు మోడీకి సహకరిస్తానని శరత్ కుమార్ అన్నారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ని భారతదేశ ముస్లింలతా స్వాగతించాలని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏని నోటిఫై చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని స్వాగతించారు. ముస్లిం సమాజంలో భయాలను తొలగించడానికి ప్రయత్నించాలని, సీఏఏ ప్రభావం భారతీయ ముస్లింపై, వారి పౌరసత్వంపై ఉండదని అన్నారు.
Bihar: బీహార్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లిని వీడియో తీసేందుకు వచ్చిన వ్యక్తి ఏకంగా పెళ్లి కొడుకు చెల్లిని లేపుకుపోయాడు. ప్రస్తుతం ఈ వార్త ఆ రాష్ట్రంలో తెగవైరల్ అవుతోంది. ముజఫర్ నగర్లో ఓ పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు వచ్చిన యువకుడు వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఈ ఘటన అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు అన్నీ పూర్తయిన తర్వాత బాలిక పారిపోయింది.
Gujarat: ప్రస్తుతం జరుతున్న గుజరాత్ రాష్ట్ర 10వ తరగతి బోర్డు పరీక్షల్లో వరల్డ్ కప్ ఫైనల్ - 2023 మ్యాచ్ గురించి ఓ ఆసక్తికర ప్రశ్న వచ్చింది. అహ్మదాబాద్ లో జరిగిన 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశారా..? అయితే ఆ మ్యాచ్ ను మీ పరిశీలనను బట్టి మ్యాచ్ గురించి ఓ రిపోర్ట్ రాయండి.. అంటూ బోర్డు పరీక్ష ప్రశ్న పత్రంలో 4 మార్కులకు ప్రశ్న వచ్చింది. ఎన్నో అంచనాలతో ఈ సారి భారత జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని…
Viral Video: 23 ఏళ్ల చరిత్రలో స్వదేశీ టెక్నాలజీ కలిగిన తేజస్ యుద్ధవిమానం తొలిసారిగా ఈ రోజు కూలిపోయింది. రాజస్థాన్ జైసల్మేర్ హాస్టర్ కాంప్లెక్స్ సమీపంంలో ఈ యుద్ధవిమానం కుప్పకూలింది. పైలెట్ పారాశూట్ సహాయంతో సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఎంక్వైరీకి ఆదేశించింది. ప్రస్తుతం ప్రమాదానికి గురవుతున్న పైలెట్ ఎజెక్ట్ చేస్తూ, బయటపడిన వీడియో వైరల్ అవుతోంది.
Haryana: హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. ఛండీగఢ్‌లో గవర్నర్ బండారు దత్రాత్రేయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కూడా ఉన్నారు. బీజేపీ-జేజేపీ మధ్య ఎంపీ సీట్ల షేరింగ్‌పై విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది.
Russia: టేకాఫ్ సమయంలో 15 మందితో వెళ్తున్న రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది. మాస్కోకు ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా మంగళవారం విమానం కూలిపోయినట్లుగా రష్యా తెలిపింది. 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు సమాచారం.
Danish Kaneria: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ డానిష్ కనేరియా భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు మద్దతు తెలిపారు. 2015కి ముందు భారత్‌కి తరలివెళ్లిన శరణార్థులకు సంబంధించి, సీఏఏ నిబంధనలు పాకిస్తానీ హిందువులందరికీ మంచివని కనేరియా ప్రశంసించారు. పాకిస్తానీ హిందువులు ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకోగలుగుతారు అని కనేరియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సీఏఏని అమలు చేసినందుకు భారత ప్రధాని నరేంద్రమోడీకి, హోమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.