Pakistan: తప్పిపోయిన తమ దేశ మత్స్యకారుల జాడను కొనుక్కోవడానికి దాయాది దేశం పాకిస్తాన్, భారత్ సాయాన్ని కోరుతోంది. సింధ్ ప్రావిన్స్ లోని కేతి బందర్ పోర్టు సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంతో కనీసం 14 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే, వీరి ఆచూకీ తెలుసుకోవడానికి భారతదేశం సాయాన్ని కోరాలని పాకిస్తాన్ చట్టసభ సభ్యులు ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్‌ని బలవంతం చేస్తున్నారు.
పాక్ మీడియా డాన్ నివేదిక ప్రకారం.. కరాచీలోని మాలిర్ జిల్లాలోని మత్స్యకార గ్రామమైన ఇబ్రహీం హైదరీకి చెందిన 45 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. అయితే, వారి పడవ కేతిబందర్ సమీపంలోని హిజామ్ క్రో క్రీక్ వద్ద బోల్తా పడింది. మార్చి 5 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 31 మంది రక్షించబడగా.. 14 మంది కనిపించకుండా పోయారు.
Read Also: Brijendra Singh: హర్యానాలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ బ్రిజేంద్ర సింగ్..
పాకిస్తాన్ నేవీ, మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు ఈధి ఫౌండేషన్‌లకు చెందిన డైవర్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయినీ వీరిని కనుగొనడంలో విఫలమయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఎంపీ అఘా రఫీయుల్లా మాట్లాడుతూ.. తాను శనివారం ప్రధాని షెహబాజ్ షరీఫ్, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షాతో మాట్లాడానని, తప్పిపోయిన వారిని కనుగొనడానికి భారత అధికారులను సంప్రదించి వారి సాయం తీసుకోవాలని కోరానన్నారు. తప్పిపోయిన మత్స్యాకారులు బాడీలు అలల తీవ్రతతో భారత జలాల్లోకి వెళ్లోచ్చని రఫీయుల్లా అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని భారత అధికారులతో ప్రస్తావిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.