Himanta Biswa Sarma: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని విమర్శిస్తున్నప్పటికీ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చట్టం అమలుకు మొగ్గుచూపింది. అయితే, ఈ చట్టంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి)కి దరఖాస్తు చేసుకోని వ్యక్తికి పౌరసత్వం లభిస్తే తాను రాజీనామా చేసే మొదటి వ్యక్తి తానేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం అన్నారు. సీఏఏ అమలుపై అస్సాం వ్యాప్తంగా నిరసన చెలరేగిన తరువాత…
Tejas Fighter Jet: పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రాజస్థాన్‌లో కుప్పకూలింది. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో తొలిసారిగా విమానం క్రాష్ అయింది. జైసల్మేర్‌లోని హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కుప్పకూలింది. పైలెట్ ఎజెక్షన్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. 2001లో టెస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమైన ఈ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోవడం ఇదే తొలిసారి.
Boeing: విమాన తయారీ దిగ్గజం ‘బోయింగ్’కి సంబంధించిన రహస్యాలను బయటపెట్టిన ఆ సంస్థ మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ అనుమానాస్పదంగా మరణించారు. ఎయిర్ లైనర్ సంస్థ లోపాలను బయటపెట్టిన వ్యక్తిగా ఈయన ప్రసిద్ధి చెందారు. శనివారం ఆయన తన ఇంట్లో శవమై కనిపించారు. ఈ విషయాన్ని సౌత్ కరోలినా చార్టెస్టర్ కౌంటీ అధికారులు ధృవీకరించారు.
Cruel woman: కర్ణాటక మంగళూర్లో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. 87 ఏళ్ల మామపై అమానుషంగా ప్రవర్తించింది. వాకింగ్ స్టిక్‌తో దారుణంగా కొట్టింది. తనను కొట్టొద్దని వృద్ధుడు ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, సదరు మహిళ రాక్షసిలా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఈ ఘటన మార్చి 9న జరిగింది.
Kamal Haasan: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశాన్ని విభజించేందుకు సీఏఏని అమలు చేశారని కమల్ హాసన్ ఆరోపించారు. శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దేశ సామరస్యాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల్ని విభజించి, సామరస్యాన్ని శాననం చేయడానికి ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో గెలవాలనే తపనతో, బీజేపీ హడావుడిగా సీఏఏని తెరపైకి తెచ్చిందని…
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
Tamil Nadu: మాములుగా నిమ్మకాలకు ఎంత ధర ఉంటుంది..? మహా అయితే రూ. 10కి మించదు. కానీ తమిళనాడులో ఓ ఆలయంలోని నిమ్మకాయ మాత్రం ఏకంగా రూ. 35,000 ధర పలికింది. తమిళనాడులోని ఓ గ్రామంలో ప్రైవేటు ఆలయంలో జరిగిన వేలం పాటులో ఇంత ధర పలకడం చూసి సామాన్యుడు అవాక్కవుతున్నాడు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దారుణం జరిగింది. అప్పటి వరకు ఆహ్లాదంగా జరిగిన కుటుంబ కార్యక్రమంతో హత్య జరిగింది. ఫంక్షన్లో డ్యాన్స్ చేయనీకుండా, మ్యూజిక్ ఆపేసినందుకు ఒక వ్యక్తి తన అన్నని గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు ఆదివారం తెలిపారు. కోఠి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మౌహార్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన నిందితుడు రాజ్ కుమార్ కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందువుల్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ చట్టాలను తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందని, చట్టాలను తీసుకువచ్చిందని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చని సూచించారు.
Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీదీ ప్రకటనలో బెంగాల్లో ఇండియా కూటమి లేదని స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నాయి. బెంగాల్లో ఒంటరి పోరుకే మమత మొగ్గు చూపారు.