CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు నారావారి పల్లెలో పర్యటిస్తున్నారు. ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రూ.140 కోట్లతో శంకుస్థాపనలు, రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను చంద్రగిరి ప్రాంతానికి తరలించడంతో కోసం మూలపల్లి చెరువు వద్ద రూ.126 కోట్ల ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో రంగంపేట- భీమవరం రోడ్ నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Read Also: Iran: ఉరిశిక్షలతో అణచివేత.. 26 ఏళ్ల నిరసనకారుడికి ఇరాన్ మరణశిక్ష..
అలాగే, నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. రూ.1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ ప్రారంభం చేయనున్నారు. సంజీవని ప్రాజెక్టులకు శుభారంభం చేస్తారు. అలాగే, తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన రుయా ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్ ప్రారంభించనున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో బాయ్స్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ లను ప్రారంభించనున్నారు. ఇక, రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయం, ఎస్వీ యూనివర్సిటీలో రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబ్స్, రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ రెండో అంతస్తు నిర్మాణంతో పాటు రూ.2.91 కోట్లతో ఎస్వీ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.