Trinamool Congress: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు. ఈ రోజు కోల్‌కతాలో జరిగిన టీఎంసీ మెగా బ్రిగేడ్ ర్యాలీలో ఆమె లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు.
Read Also: Pakistan: “ప్లీజ్, మా వాళ్ల జాడ కనుక్కోండి”.. భారత్ సాయం కోరిన పాకిస్తాన్..
మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బెర్హంపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పఠాన్ పేరుంది. కాంగ్రెస్ కీలక నేత, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న అధిర్ రంజన్ చౌదరికి పోటీగా యూసుఫ్ పఠాన్ బరిలో దిగుతున్నారు. బహరంపూర్ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించనప్పటికీ, చౌదరి లోక్‌సభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన స్థానం నుండి మళ్లీ పోటీ చేయాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే వివాదాస్పద నేత మహువా మోయిత్రాను మరోసారి టీఎంసీ కృష్ణానగర్ నుంచి బరిలోకి దింపుతోంది. సందేశ్‌ఖాలీ గొడవల నేపథ్యంలో బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ నుస్రత్ జహాన్‌ని తప్పించి, హరోవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నూరుల్ ఇస్లాంను రంగంలోకి దింపింది. అసన్సోల్ ఎంపీ స్థానం నుంచి బాలీవుడ్ స్టార్ శత్రుఘ్ను సిన్హాను, దుర్గాపూర్ నుంచి కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులను టీఎంసీ పోటీలో నిలబెట్టింది. ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో ఎంపీగా బహిష్కరించబడిని మహువా మొయిత్రాకు టీఎంసీ మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపింది.