Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబుదాడి.. పెషావర్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు మరణించినట్లుగా అదికారులు వెల్లడించారు. పెషావర్‌లోని బోర్డ్ జబార్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Read Also: Turtle meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృతి.. 78 మందికి తీవ్ర అస్వస్థత..
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
మోటార్ సైకిల్‌పై పేలుడు పదార్థాలు అమర్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు జరిగిన తీరును గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడులో అనుమానిత బాంబర్ కూడా చనిపోయాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పెషావర్ పోలీస్ చీఫ్ కాషిఫ్ అబ్బాసీ తెలిపారు. అయితే, ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా బాధ్యత వహించలేదు. ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ పేలుడు ఘటనను ఖండించారు. పోలీసుల నుంచి నివేదిక కోరారు.
ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం పాకిస్తాన్ తాలిబాన్లకు కేంద్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడి గిరిజన ప్రాంతాల్లో తాలిబాన్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. పాక్ పోలీసులు, ఆర్మీ లక్ష్యంగా తాలిబాన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!