Russia: రష్యాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం లుకోయిల్ వైస్ ప్రెసిడెంట్ విటాలీ రాబర్టస్ తన కార్యాలయంలో ఆత్మహత్య పాల్పడ్డారు. మార్చి 12న రాబర్టస్ మరణించాడని లుకోయిల్ సంస్థ చెప్పినట్లు యూరో న్యూస్ నివేదించింది. రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ డిప్యూటీ సీఈవో విటాలీ రాబర్టస్(53) అకస్మాత్తుగా మరణించారని ఉక్రేనియన్-అమెరికన్ ఆర్థికవేత్త రోమన్ షరెమెటా ట్వీట్ చేశారు. అయితే మరణానికి కారణాలను వెల్లడించలేదు.
PM Modi: వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ దేశ పర్యటకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ చేసిన ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం చూపిందని, అందుకే కేంద్రం ఇంధన ధరల్ని…
Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేదదేశాలుగా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) తలసరి జీడీపీ ఆధారంగా కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ)ని హైలెట్ చేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. జీడీపీ ఒక దేశం యొక్క మొత్తం ఆర్థిక ఉత్పత్తికి కొలమానంగా ఉంటే, పీపీపీ అనేది ప్రజల జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఆఫ్రికా దేశం దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఉంది. ఈ దేశ జీడీపీ తలసరి పీపీపీ 492.72 డాలర్లుగా ఉంది. 2011లో పొందిన ఈ దేశం రాజకీయ…
Bengaluru Water Crisis: భారత సిలికాన్ వ్యాలీ, టెక్ హబ్ బెంగళూర్ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాలు వస్తేనే నగర నీటి కష్టాలు తీరుతాయని నిపుణులు, ప్రజలు చెబుతున్నారు. అయితే, వర్షాకాలానికి 4 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏ పార్టీకి ఎవరు ఎంత నిధులు అందించారనే విషయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ని ఆదేశించింది. ఈ మేరకు నిన్న భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో సమాచారాన్ని ఉంచింది. అత్యున్నత కోర్టు కఠిన ఆదేశాల తర్వాత ఎస్బీఐ దిగి వచ్చింది. ఎస్బీఐ మంగళవారం సాయంత్రం ఈ వివరాలను ఈసీకి అందించగా.. గురువారం ఈసీ ఈ వివరాలను బహిర్గతం చేసింది.
BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూర్‌లోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల ప్రకారం.. చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి, ఆమె కుమార్తె యడియూరప్ప దగ్గరకు వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులు జరిగనట్లు బాలిక తల్లి ఆరోపించారు.
Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
Odisha: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన…