Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏ పార్టీకి ఎవరు ఎంత నిధులు అందించారనే విషయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)ని ఆదేశించింది. ఈ మేరకు నిన్న భారత ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో సమాచారాన్ని ఉంచింది. అత్యున్నత కోర్టు కఠిన ఆదేశాల తర్వాత ఎస్‌బీఐ దిగి వచ్చింది. ఎస్‌బీఐ మంగళవారం సాయంత్రం ఈ వివరాలను ఈసీకి అందించగా.. గురువారం ఈసీ ఈ వివరాలను బహిర్గతం చేసింది.
Read Also: Shocking Video: బీర్ క్యాన్ లో పాముతో విషం కక్కించి మరి దానిని తాగిన యువకుడు..!
విడుదల చేసిన జాబితాలో ఏప్రిల్ 2019-జనవరి 2024 మధ్య బాండ్ల ద్వారా ఏ పార్టీ ఎన్ని విరాళాలు పొందింది, వీటిని ఎవరు ఇచ్చారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు ఈ డేటా విడుదలపై మరింత గడువు కావాలని ఎస్బీఐ చేసిన విజ్ఞప్తిని సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. గడువులోకిగా డేటా ఇవ్వకుంటే ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ పథకం కింద నిధులు ఇచ్చిన వారు కేవైసీ ఫారమ్, చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్‌లకు సంబంధించిన చెల్లింపు రుజువులు సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది.
గత నెలలో సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పులో ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఎలక్టోరల్ బాండ్ల అంశం వివాదాస్పదమైంది. అధికార బీజేపీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాయి.
ఏ పార్టీకి ఎన్ని నిధులు..?(రూ. కోట్లలో):
బీజేపీ – 6061
తృణమూల్ కాంగ్రెస్ – 1610
కాంగ్రెస్ – 1422
బీఆర్ఎస్ – 1215
బిజూ జనతాదళ్(బీజేడీ) – 776
డీఎంకే – 639
వైఎస్ఆర్సీపీ – 337
టీడీపీ – 219
శివసేన – 158
ఆర్జేడీ – 73
ఆప్ – 65
జేడీఎస్ – 44
సిక్కిం క్రాంతికారి మోర్చా – 37
ఎన్సీపీ – 31
జనసేన – 21