PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ దేశ పర్యటకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ చేసిన ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం న్యూఢిల్లీలో భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్‌గేతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలు, భాగస్వామ్యంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రాజు వాంగ్‌చుక్ తరపున అధికారిక ఆహ్వానాన్ని భూటాన్ ప్రధాని టోబ్‌గే, ప్రధాని మోడీకి అందించారు. దీనికి మోడీ ఓకే చెప్పారు. అయితే, పర్యటన అధికారిక తేదీలను విదేశాంగ శాఖ తర్వలో విడుదల చేసే అవకాశం ఉంది.
Read Also: Congress: కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపు రాహుల్ గాంధీ ఘనతే..
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ, ఇంధనం, జలవిద్యుత్ సహకారం, ప్రజలతో ప్రజల మార్పిడి మరియు అభివృద్ధి సహకారంతో సహా వివిధ రంగాలలో పురోగతిని సమీక్షించారు. భారత్, భూటాన్ మధ్య ఉన్న ప్రత్యేకమైన స్నేహాన్ని బలపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. భూటాన్ అభివృద్ధిలో నమ్మకమైన మిత్రుడైన భారత్ పాత్రను ఆ దేశ ప్రధాని ప్రశంసించారు.
భారత్,చైనా సరిహద్దుల్లో ఉన్న భూటాన్ దేశం వ్యూహాత్మకంగా భారత్‌కి ఎంతో కీలకం. గతంలో డోక్లాం పీఠభూమి వద్ద చైనా ఆర్మీని అడ్డుకుని భూటాన్ సార్వభౌమాధికారాన్ని భారత్ కాపాడింది. అయితే, ఇటీవల కాలంలో చైనా ఆ దేశానికి దగ్గరవుతోంది. దీంతో పాటు చైనా, భూటాన్ తమ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాయి. అయితే, ఈ విషయంలో భారత్‌పై వ్యూహాత్మకంగా పైచేయి సాధించేందుకు భూటాన్‌ని చైనా వాడుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ భూటాన్ పర్యటన పరిస్థితిని మార్చే అవకాశం ఉంది.
Glad to meet my friend and PM of Bhutan @tsheringtobgay on his first overseas visit in this term. Had productive discussions encompassing various aspects of our unique and special partnership. I convey heartfelt thanks to His Majesty the King of Bhutan and @PMBhutan for inviting… pic.twitter.com/Ab7wXH2TVt
— Narendra Modi (@narendramodi) March 14, 2024
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!