US Iran Tensions: ఇరాన్‌పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్ ఎయిర్‌బేస్‌లో విమానాల మోహరింపు..
- ఇరాన్‌పై దాడికి సిద్ధమైన అమెరికా..
- ఖతార్ ఎయిర్ బేస్‌లో యూఎస్ మోహరింపు..
- ఇప్పటికే ఇరాన్‌లోని తన పౌరులకు కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Iran Tension: ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే అన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారు. మరోవైపు, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు ఇరాన్ మతపాలకులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు, ఈ నిరసనల్లో దాదాపుగా 500 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఉరిశిక్షల్ని ఉపయోగించి నిరసనల్ని క్రూరంగా అణగదొక్కాలని భావిస్తోంది.
Read Also: Death and Brain: మరణానికి ముందు ఏం జరుగుతుంది.? చివరి క్షణాల్లో మెదడు ఏం చేస్తుంది..
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో, ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అమెరికన్ ఎయిర్ బేసుల్లో మోహరింపు పెరిగింది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు ఉన్న అతిపెద్ ఎయిర్ బేసుల్లో ఒకటైన ఖతార్‌లోని అల్ ఉడెయిడ్ బేస్ యాక్టివేట్ అయింది. ఈ ఎయిర్ బేస్‌లో యుద్ధ విమానాలను మోహరిస్తున్నట్లు తెలిసింది. ఈ వైమానిక స్థావరం ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 300 కి.మీ దూరంలో ఉంది.
ఇప్పటికే అమెరికా ఇరాన్‌లోని తన పౌరుల్ని ఆ దేశం విడిచి వెళ్లమని కోరింది. ఇజ్రాయిల్ మీడియా నివేదిక ప్రకారం, గాలిలో ఇంధనాన్ని నింపే విమానంతో పాటు, B-52 వ్యూహాత్మక బాంబర్‌తో సహా అనేక అమెరికా యుద్ధ విమానాలను మోహరించినట్లు తెలుస్తోంది. ఖతార్ రాజధాని దోహాకు నైరుతి దిశలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వైమానిక స్థావరంలో 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. ఇది ఈ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాలలో ఒకటి, ఇక్కడ 4,500 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది, ఇది B-52 వ్యూహాత్మక బాంబర్లు, రవాణా విమానాల వంటి పెద్ద సైనిక విమానాలకు అనువుగా ఉంటుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!