Imran Khan: ఫిబ్రవరిలో దాయాది దేశం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఓటమి కోసం చాలా చోట్ల రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లు ఉంటే రిగ్గింగ్ సమస్యల్నీ గంటలో పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ అడియాలా జైలులో మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు.
Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని హెల్మండ్ ప్రావిన్సులో ఆదివారం బస్సు-ఆయిల్ ట్యాంకర్, మోటార్ బైక్ ఢీకొనడంతో 21 మంది మరణించారు. 38 మంది గాయాపడినట్లు ప్రావిన్షియల్ అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘానిస్తాన్ మొత్తం సరైన రోడ్డు వ్యవస్థ లేకపోవడం, కొండలు-పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ముఖ్యం ముస్లిం దేశాల్లో ఇజ్రాయిల్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయిల్‌కి సంబంధించిన ఓ పోస్టు తెగవైరల్ అవుతోంది. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన వారిని అనుమతించని దేశాల లిస్టు వైరల్ అయింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే పేజీలో ఇజ్రాయిల్ పౌరులను తమ గడ్డపైకి అనుమతించనని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ముస్లిం మెజారిటీ కలిగిన దేశాలు ఉన్నాయి. అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్,…
Petrol-diesel Rates: పెట్రోల్-డీజిల్ రేట్లతో అల్లాడుతున్న జనాలకు కేంద్రం ఇటీవల తీపి కబురు చెప్పింది. లీటర్‌పై రూ.2 తగ్గించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎంత తగ్గించినా, రేట్లు మాత్రం ఇంకా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉండగా.. అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులు లేదా…
Live-In Partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న వారు తమ భాగస్వాములను కిరాకతంగా హత్య చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గురుగ్రామ్ సమీపంలోని చౌమా గ్రామంలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో మహిళ శవమై కనిపించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో లలన్ యాదవ్(35) అనే నిందితుడు మద్యం మత్తులో మహిళను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
Viral Video: క్లాస్ రూపంలో మహిళా టీచర్ బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు ప్రోత్సహిస్తుంటే ఆమె డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘బంటీ ఔర్ బబ్లీ’’ సినిమాలో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ చేసిన కజ్రారే పాటకు సదరు ఉపాధ్యాయురాలు చిందులేసింది.
Lok Sabha Elections 2024: ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నట్లు ఈసీ వెల్లడించింది. దాదాపుగా 82 రోజుల సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది.
Omar Abdullah: ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలు ప్రతిపక్షాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతదేశం పేదగా మారితే, బీజేపీ ధనవంతమైందని ఆరోపించారు. శనివారం ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వ్యతిగత దాడికి దిగిన ప్రతీసారి అది బూమరాంగ్ అవుతోందని అన్నారు.
Telangana: లోక్‌సభ షెడ్యూల్ విడుదలైంది. ఇక పోరు మిగిలింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ఇకపై తెలంగాణలో పోరు మరింత హీటెక్కనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. మార్చి 15న హైదరాబాద్ ప్రచారానికి అమిత్ షా రాబోతున్నారు. మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే…
Pakistan: పాకిస్తాన్లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది. గిరిజన జిల్లాలోని సెక్యురిటీ చెక్‌పోస్టుపై శనివారం ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాదికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ఏడుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మృతుల్లో్ ఉన్నారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు.