Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్‌ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది.
Election Commissioners: భారత ఎన్నికల సంఘం ప్యానెల్లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించి పలు అంతర్జాతీయ సంస్థలు తప్పుబడుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి, అమెరికాలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. భారత్ తీసుకువచ్చిన సీఏఏ సమానత్వం, మతపరమైన వివక్షత, భారతదేశ అంతర్జాతీయ మానవహక్కుల బాధ్యతలకు అసంబద్ధమని, రాజ్యాంగ విలువలకు దెబ్బగా అభివర్ణించింది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం అనేది మతం ఆధారంగా వివక్షను చూపిస్తోందని,
OTT platforms: అసభ్యకరమై కంటెంట్ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. ఓటీలతో పాటు 57 సోషల్ మీడియా హ్యాండల్స్ని నిషేధించింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ హెచ్చరికల తర్వాత దేశ వ్యాప్తంగా 18 OTT ప్లాట్‌ఫారమ్‌లు, 19 వెబ్సైట్లను, 10 యాప్‌లను, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
Pulwama attack: పుల్వామా దాడిపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. పుల్వామా ఘటన కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఆంటోఆంటోనీ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు 42 మంది జవాన్ల ప్రాణాలనున బలిగొందని ఆయన విలేకరులు సమావేశంలో అన్నారు. పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని చెప్పడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపింది. ప్రోటోకాల్ పరిగణలోకి తీసుకోకుండా, జవాన్లను ఉద్దేశపూర్వకంగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లేలా చేశారని, మాజీ గవర్నర్ సత్యపాల్…
Bengaluru cafe blast: మార్చి 1న బెంగళూర్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), బెంగళూర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టీం ప్రయత్నిస్తున్నాయి. నిందితుడికి సంబంధించిన వీడియోలను విడుదల చేసిన ఎన్ఐఏ, అతడిని పట్టుకునేందుకు ప్రజల…
Amit Shah: భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని అమలు చేస్తోంది. డిసెంబర్ 31, 2014కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులు ఇలా ముస్లిమేతరులకు ఈ చట్టం ద్వారా భారత పౌరసత్వం లభించనుంది. అయితే, ఈ చట్టంలో ముస్లింలను ఎందుకు మినహాయించారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రహోంమంత్రి మాట్లాడుతూ.. ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు.
Supreme Court: విద్యార్థినికి బలవంతగా పువ్వులు తీసుకోవాలని టీచర్ కోరడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికకు ఇతరుల ముందు పువ్వులు ఇచ్చి, వాటిని తీసుకోవాలని బలవంతం చేయడం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ ఇచ్చే (పోక్సో)చట్టం కిందకు వస్తుందని చెప్పింది. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి ప్రతిష్టపై సంభావ్య ప్రభావాన్ని గుర్తిస్తూ, సాక్ష్యాధారాలను కఠినంగా పరిశీలించాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెబుతూ, అతనికి విధించిన మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేసి…
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రతిపక్షాలు అబద్ధాల రాజకీయాలను ఆశ్రయిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని మైనారిటీలు భయపడాల్సిన పని లేదని, ఎందుకంటే ఇది ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకోదని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కి వచ్చిదిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందించడమే సీఏఏ లక్ష్యమని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో ఉరితీయబడ్డాడు. రాజకీయ నాయకుడి హత్యకు కుట్ర చేశాడనే అభియోగాలపై 1979లో లాహోర్ హైకోర్టు భుట్టోకి మరణశిక్ష విధించింది. సైనిక తిరుగుబాటుకు పాల్పడి భుట్టోని అధికారంలో నుంచి దించిన జియా ఉల్ హక్ అతనిపై అవినీతి ఆరోపణలు, ఇతర అభియోగాలు మోపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పాకిస్తాన్ న్యాయవ్యవస్థ సరిగా పనిచేయలేదనే భావన ఉంది.