Election Commission: కేంద్రం ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో రెడ్ లైన్ దాటొద్దని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
Lok Sabha Elections 2024: కేంద్రం ఎన్నికల సంఘం లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు.
Lok Sabha Elections 2024: ఎన్నిలక నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 దశాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 7 దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నట్లు ప్రకటించారు.
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీని విడుదల చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటేయడానికి మొత్తం 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఇందులో ఇందులో ఇటీవలే 18 ఏళ్లు నిండిన 1.8 కోట్ల మంది ఉన్నారు. వీరంతా తొలిసారి ఓటేసేందుకు అర్హత సాధించారు. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 88.4 లక్షల మంది…
India At UN: పాకిస్తాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. వేదిక ఏదైనా భారత వ్యతిరేక స్వరాన్ని వినిపించడం మానడం లేదు. తాజా మరోసారి యూఎన్ వేదికగా మరోసారి భారత్‌ని ఉద్దేశించి మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ అయోధ్యలో రామ మందిరం, సీఏఏ గురించి వ్యాఖ్యానించారు. పూర్తి భారత అంతర్గత విషయమైన దీనిపై పాకిస్తాన్ వ్యాఖ్యానించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యాల్ని ‘‘విరిగిన రికార్డు’’గా అభివర్ణించింది.
Bengaluru Water crisis: వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు.. కోవిడ్‌ని గుర్తు చేస్తున్న బెంగళూర్ నీటి సంక్షోభం..బెంగళూర్ వాసులకు నీటి కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎండలు పూర్తిగా ముదరకముందే సిలికాన్ వ్యాలీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ కష్టపడుతోంది. ఇప్పటికే చాలా వరకు అపార్ట్మెంట్లలో నీరు లేదు. దీంతో వారంతా డిస్పోజబుల్ ప్లేట్లను, వెట్ వైప్‌లను వాడుతున్నారు. మరికొందరు సమీపంలోని మాల్స్లకి కస్టమర్లలా వెళ్లి కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. మరో మూడు నాలుగు నెలలు కానిదే రుతుపవనాలు వచ్చే పరిస్థితి…
Arvind Kejriwal: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును వ్యతిరేకిస్తూ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన శరణార్థుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి నిరసన సెగ తగిలింది. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ, సిక్కు శరణార్థులు కేజ్రీవాల్ ఇంటి నివాసం వద్ద నిరసనకు దిగారు. అయితే వీరిని ‘పాకిస్తానీలు’ అని పిలిచి మరో వివాదానికి తెరలేపారు.
Supreme Court: ఎలక్షన్ కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుల నియామకంపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ చేపట్టనుంది. మాజీ ఐఏఎస్ అధికారులైన ఇద్దరిని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిన్న ఎంపిక చేసింది.
Lok Sanha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుంది.