Odisha: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత సమాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో ఒడిశాలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
Read Also: SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
అయితే, ఈ ప్రకటన చేసిన రెండు గంటల తర్వాత, మా జాతీయాధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అదే తుది నిర్ణయమని, నా ప్రకటన ఆధారంగా మీడియా కథనాలు చేయకూడదని ఆయన అన్నారు. అంతకుముందు ఎక్స్‌లో పోస్ట్ చేసిన ‘‘ఒడిశాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’’ వ్యాఖ్యల్ని తొలగించారు. మరోవైపు బీజేడీ పార్టీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో పార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ఒడిశా పర్యటన ఒక మార్చి 6న సమావేశం జరిగింది. ఈ సమయంలో BJD ఉపాధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా అప్పుడు బిజెపితో సాధ్యమైన పొత్తు గురించి చర్చిస్తున్నట్లు అంగీకరించారు. మార్చి 10న ఒడిశా బీజేపీ నాయకులు ఢిల్లీ వెల్లడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిందనే వార్తలు వినిపించాయి.
2008లో కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోయింది. ఎన్డీయే కూటమి నుంచి బీజేడీ వైదొలిగింది. ఈ రెండు పార్టీలు 1998-2009 వరకు 11 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నాయి. 2009 వరకు మూడు లోక్‌సభ ఎన్నికల్లో, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.