స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘శాంసంగ్’ శుభవార్త చెప్పింది. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా ‘సూపర్ బిగ్ రిపబ్లిక్, సూపర్ బిగ్ టీవీ’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. జనవరి 8న ప్రారంభమైన ఈ సేల్.. 31 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్, ప్రీమియం స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ సేల్‌లో శాంసంగ్ తాజా Vision AI టెక్నాలజీతో వచ్చిన టీవీలపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన Vision AI టీవీ మోడల్స్ కొనుగోలు చేసే వారికి రూ.92,990 వరకు విలువైన శాంసంగ్ సౌండ్‌బార్‌ను ఉచితంగా అందిస్తోంది. దీంతో అదనపు ఖర్చు లేకుండా హోమ్ థియేటర్ అనుభూతిని పొందే అవకాశం ఉంది. టీవీతో పాటు సౌండ్ క్వాలిటీపై ఆసక్తి ఉన్నవారికి ఇది ప్లస్‌గా మారనుంది. అంతేకాకుండా ఖరీదైన టీవీల కొనుగోలుపై జీరో డౌన్ పేమెంట్, 30 నెలల వరకు ఈఎంఐలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్లతో టీవీ అసలు ధర మరింత తగ్గుతుంది.
ఈ రిపబ్లిక్ డే ఆఫర్లు శాంసంగ్.కామ్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక రిటైల్ స్టోర్లలో జనవరి 31 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే మోడల్, బ్యాంక్, ప్రాంతాన్ని బట్టి ఆఫర్లు మారవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. భద్రత కోసం Samsung Care+ ప్లాన్లను కూడా ప్రోత్సహిస్తోంది. ఇవి రూ. 599 నుంచే ప్రారంభమవుతాయి. స్టాండర్డ్ వారంటీకి అదనంగా ఎక్స్‌టెండెడ్ కవరేజ్, మెయింటెనెన్స్ సేవలు, ఉచిత సర్వీస్ యాక్సెసరీస్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్లలో ఉన్నాయి. ఖరీదైన టీవీ కొనుగోలు చేసే వారికి దీర్ఘకాలిక భరోసా కల్పిస్తాయి. ప్రీమియం 8K నుంచి విలువైన 4K QLED టీవీల వరకు శాంసంగ్ ఈ సేల్‌లో ఆఫర్లు అందిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త టీవీ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పొచ్చు.
సేల్‌లో టాప్ శాంసంగ్ Vision AI టీవీలు:
# Samsung Neo QLED 8K Smart TV QN900F
(65 అంగుళాల మోడల్ ధర రూ. 2,42,390 నుంచి)
8K రిజల్యూషన్, మినీ LED టెక్నాలజీ, 70W డాల్బీ అట్మాస్ సౌండ్, హైఎండ్ గేమింగ్ ఫీచర్లతో ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో నిలుస్తుంది.
# Samsung 4K Neo QLED Smart TV QN90F
(55 అంగుళాల మోడల్ ధర రూ. 1,20,690 నుంచి)
4K మినీ LED డిస్‌ప్లే, 165Hz గేమింగ్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ ఆడియోతో గేమర్లు, సినిమా లవర్స్‌కు మంచి ఎంపిక.
# Samsung OLED 4K Smart TV S95F
(55 అంగుళాల మోడల్ ధర సుమారు రూ. 1,60,990)
QD-OLED ప్యానెల్, అద్భుతమైన కాంట్రాస్ట్, 70W సౌండ్ సిస్టమ్‌తో హైఎండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
# Samsung The Frame QLED 4K Smart TV LS03F
(43 అంగుళాల మోడల్ ధర రూ. 56,890 నుంచి)
ఆర్ట్ మోడ్‌తో స్టైలిష్ లుక్, హోమ్ డెకోకు సరిపోయే డిజైన్ ఈ టీవీ ప్రత్యేకత.
Samsung Vision AI 4K QLED Smart TV QEF1
(43 అంగుళాల మోడల్ ధర రూ. 36,990 నుంచి)
అఫోర్డబుల్ ధరలో Vision AI ఫీచర్లతో కూడిన 4K QLED టీవీగా ఇది మంచి ఆప్షన్.