Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ఘటన నిందితుడు షేక్ షాజహాన్ టార్గెట్‌గా ఈడీ ఈ రోజు భారీ దాడులు నిర్వహిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్ తర్వాత ఈడీ, పారామిలిటరీ బలగాలు ఈ రోజు నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఈడీ అధికారులు గురువారం ఉదయం 6.30 గంటలకు షేక్ షాజహాన్కి చెందిన ఇటుక బట్టితో పాటు ధమఖలీ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
Bird Flu: 2019లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ అన్ని దేశాల్లో మరణాలకు కారణమైంది. కోవిడ్-19 మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేకపోతోంది. ఇదిలా ఉంటే సమీప భవిష్యత్తులో మరో పాండెమిక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దానిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.
Tiger attack: పెద్ద పులిని చూస్తేనే సగం ప్రాణాలు పోతాయి. ఇక అది దాడి చేస్తే తప్పించుకోవడం అంత సులభం కాదు. కానీ ఉత్తరాఖండ్‌కి చెందిన 17 ఏళ్ల బాలుడు మాత్రం పెద్దపులితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రామ్‌నగర్ పట్టణానికి చెందిన అంకిత్ పులిదాడికి గురయ్యాడు. ప్రాణాంతక దాడి తర్వాత అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.
Ukraine War: రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు.
Pitbull: పలు విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫార్సు చేసింది. పెటా ఇండియా అభ్యర్థన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లిగల్ ఫైటింగ్, దాడులకు ఎక్కువగా ఉపయోగించే విదేశీ కుక్క జాతుల అమ్మకం, పెంపకం లేదా వాటిని కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. మానవుకులు ప్రమాదాలను తీసుకువస్తున్న పిట్ బుల్స్ వంటి ప్రమాదకరమైన జాతులను నిషేధించాలని కేంద్రం భావిస్తోంది.
Russia: ఓ వైపు రెండేళ్లు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు ఫిన్లాండ్- రష్యా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిన్లాండ్ సరిహద్దుల్లో తమ దళాలను, స్ట్రైక్ సిస్టమ్‌లను మోహరిస్తామని రష్యా అధినేత పుతిన్ చెప్పినట్లు ఆల్ జజీరా నివేదించింది.
TikTok: భారత్ జాడలోనే అమెరికా నడిచింది. చైనాకు షాక్ ఇస్తూ ప్రముఖ వీడియో ప్లాట్ఫారం టిక్ టాక్‌కి వ్యతిరేకం బిల్‌ని ఆమోదించింది. యూఎస్ ప్రతినిధుల సభ భారీ మెజారిటీతో బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. టిక్ టాక్ని తన చైనా ఓనర్ బైట్ డ్యాన్స్ నుంచి బలవంతంగా ఉపసంహరించుకోవాలనే బిల్లుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఒక వేళ ఇది జరగకుంటే అమెరికాలో టిక్ టాక్ని నిషేధించవచ్చు.
BJP: 2024 లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలు రూపొందిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాలను క్రాస్ చేస్తుందని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో ఆప్‌తో బీజేపీ పోటీ పడబోతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో అభ్యర్థుల విషయంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. ఏడు స్థానాల్లో ఒకరిని మినహా…
Paul Alexander: పాల్ అలెగ్జాండర్(78) గత 70 ఏళ్లుగా ఇనుప ఊపితిత్తులతో జీవనం సాగిస్తున్నాడు. పూర్తిగా ఐరన్ లంగ్స్ మిషన్ ద్వారా ఇన్నేళ్లు జీవించిన అతను మరణించాడు. ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడిన పాల్ నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. చివరకు శ్వాస కూడా స్వయంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని 600 మిలియన్ పౌండ్ల విలువైన యంత్రం సాయంతో శ్వాస తీసుకుంటూ జీవిస్తున్నాడు.
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు విడిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నాయని, అయితే రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బుధవారం పొల్లాచ్చిలో జరిగిన డీఎంకే సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏఐడీఎంకే తమ పొత్తు చెడిపోయిందని చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, వారి మధ్య రహస్య సంబంధం ఉందని ఆరోపించారు.