Russia: రష్యాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం లుకోయిల్ వైస్ ప్రెసిడెంట్ విటాలీ రాబర్టస్ తన కార్యాలయంలో ఆత్మహత్య పాల్పడ్డారు. మార్చి 12న రాబర్టస్ మరణించాడని లుకోయిల్ సంస్థ చెప్పినట్లు యూరో న్యూస్ నివేదించింది. రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ డిప్యూటీ సీఈవో విటాలీ రాబర్టస్(53) అకస్మాత్తుగా మరణించారని ఉక్రేనియన్-అమెరికన్ ఆర్థికవేత్త రోమన్ షరెమెటా ట్వీట్ చేశారు. అయితే మరణానికి కారణాలను వెల్లడించలేదు.
Read Also: Hijab : గుజరాత్‌లో హిజాబ్ వివాదం.. ప్రిన్సిపాల్ పై విద్యాశాఖ చర్య
స్థానిక రష్యన్ మీడియా కథనాల ప్రకారం… రాబర్టస్ తన మరణానికి ముందు తలనొప్పిగా ఉందని చెప్పాడని, అతని కార్యాలయానికి వెళ్లే ముందు మందులు అడిగినట్లు తెలిసింది. అనంతరం అతని గదిలోకి వెళ్లి ఉరేసుకుని కనిపించాడు. చాలా గంటల పాటు అతడు బయటకు రాకపోవడంతో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఉద్యోగులు ఆఫీసులోకి వెళ్లి చూసేలోపు ఉరి వేసుకుని కనిపించారు. అతను లుకోయిస్ కంపెనీలో 30 ఏళ్లుగా పనిచేశాడు.
ఈ మరణంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇలా ప్రముఖ వ్యాపారవేత్తలు మరణించిన సంఘటనల్లో ఇది నాలుగో ఘటన. అంతకుముందు మే 2022లో లుకోయిల్ టాప్ మేనేజర్ 43 ఏళ్ల అలెగ్జాండర్ సుబోటిన్, మైటిష్చి పట్టణంలోని ఇంటి నేలమాళిగలో చనిపోయారు. డ్రగ్స్ వల్ల గుండెపోటుతో మరణించారని ఆరోపించారు. సెప్టెంబర్ 2022లో లుకోయిల్ మాజీ చైర్మన్ 67 ఏళ్ల రవిల్ మగనోవ్ మాస్కోలోని సెంట్రల్ క్లీనికల్ హాస్పటల్ కిటికీ నుంచి పడి మరణించారు. అక్టోబర్ 2023లో లుకోయిల్ బోర్డు ఛైర్మన్ 66 ఏళ్ల వ్లాదిమిర్ నెక్రాసోవ్ గుండె వైఫల్యంతో మరణించారు.