Bengaluru Water Crisis: భారత సిలికాన్ వ్యాలీ, టెక్ హబ్ బెంగళూర్ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాలు వస్తేనే నగర నీటి కష్టాలు తీరుతాయని నిపుణులు, ప్రజలు చెబుతున్నారు. అయితే, వర్షాకాలానికి 4 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.
వేగవంతమైన పట్టణీకరణ, నీటి వనరుల లభ్యత తగ్గడం వంటి అనేక సమస్యలు బెంగళూర్ దుస్థితికి కారణమవుతున్నాయి. గత 50 ఏళ్లలో నీటి వనరుల ప్రాంతాలు 79 శాతం క్షీణించాయి, 88 శాతం వృక్ష సంపద నష్టం వంటి చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూర్ నగరం 93 శాతం కాంక్రీట్ జంగిల్‌గా మారడం నీటి సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇండియన్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ సైన్స్(IISc) అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Praneeth Rao Case Update: ప్రణీత్ రావు కేసులో ట్విస్ట్.. బయటపడ్డ ఫోన్ ఛాటింగ్
పట్టణీకరణ:
ఇటీవల దశాబ్ధాల్లో బెంగళూర్ నగరం వేగంగా విస్తరించింది. బిల్ట్ అప్ ఏరియాలు 1055 శాతం పెరిగాయి. 50 సంవత్సరాలలో నీటి వ్యాప్తి ప్రాంతాలలో గణనీయమైన 79 శాతం క్షీణత, 88 శాతం వృక్షసంపద నష్టం వాటిల్లింది.
నీటి వనరులపై ప్రభావం:
1973లో బెంగళూర్ నగరంలో 2324 హెక్టార్ల నీటి విస్తీర్ణం, 2023 నాటకి 696 హెక్టార్లకు తగ్గడంతో భూగర్భ జలాల లభ్యత దారుణంగా క్షీణించింది. ఆక్రమణలు, కాలుష్యం కారణంగా 98 శాతం చెరువులు ధ్వంసమయ్యాయి. 90 శాతం చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి.
కాలుష్యం, ఉష్ణోగ్రత పెరుగుదల:
ఇబ్బంది ముబ్బడిగా ట్రాఫిక్, ఇండస్ట్రియలైజేషన్ మొదలైనవి వాయు కాలుష్య స్థాయిలను పెంచాయి. ఇది ఉష్ణోగ్రత పెరుగుదలకు దారి తీసింది. గ్రీన్ కవర్ కోల్పోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది.
చెట్లు మాయం:
తీవ్రమైన పట్టణీకరణ చెట్లపై ప్రభావం చూపించింది. రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం, బెంగళూర్‌లో 9.5 మిలియన్ల జనాభాకు 1.5 మిలియన్ల చెట్లు మాత్రమే ఉన్నాయి.