Supreme Court: కర్ణాటక హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచరన్ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా స్థానిక ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని ‘‘పాకిస్తాన్’’గా పేర్కొన్నారు. ఇదే కాకుండా ఓ మహిళ న్యాయవాదితో స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. రిజర్వేషన్ కోటాకు నిరసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికీ రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. దేశ అంతర్గత భద్రత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆ దేశంలో లేనే లేదు. నిరసనల […]
Swati Maliwal: ఢిల్లీకి కాబోతున్న కొత్త ముఖ్యమంత్రి అతిషీపై, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని ఎన్నుకున్నారు. అయితే, ఆమెపై అదే పార్టీకి చెందిన స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుకి ఉరిశిక్షని నిలిపేయాలని పోరాడిన కుటుంబం అతిషీది అని ఆమె అన్నారు.
Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు రాత్రి షిఫ్టులు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ని సీజేఐ విమర్శించారు. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది అని అన్నారు.
అత్యాచారం, హత్య కేసుల్లో బాధితుల గుర్తింపును వెల్లడించలేమని, వికీపీడియా తప్పనిసరిగా అలాంటి సూచనలను తొలగించాలని, భారత చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఘటన తర్వాత బాధితురాలి ఫోటోలో ఆన్లైన్లో షేర్ చేయబడ్డాయి. ట్రైనీ డాక్టర్ పేరు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి ఇంతకుముందు కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
Bihar Crime: బీహార్‌లో దారుణం జరిగింది. రాజధాని పాట్నాకు 180 కి.మీ దూరంలోని సహర్సాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గన్‌తో బెదిరించి బాలికను కారులోకి ఎక్కించుకుని ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను బిట్టు, అంకుష్‌గా గుర్తించారు. శనివారం ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు మేము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు.
Hardeep Singh Puri: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సిక్కు సంఘాలతో పాటు బీజేపీ మండిపడుతోంది. అమెరికాలో ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా.. లేదా..? అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా..? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది’’ అని అన్నారు.
Doctor Rape-Murder Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించిన కేసుని ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజ ఉదయం 10.30 గంటలకు ఈ కేసుని విచారిస్తుంది. చివరిసారిగా సెప్టెంబర్ 09న సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించింది.