PM Modi: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు సందర్భంగా దేశ, విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ అంటూ విషెస్ చెప్పారు.
ఇదిలా ఉంటే, మైనారిటీలపై హింసను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృంధం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి చేరుకుంది. నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
Drug-Resistant Superbugs: 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది డ్రగ్ రెసిస్టెంట్ సూపర్‌బగ్స్ ఇన్ఫెక్షన్ల కారణంగా మరణిస్తారని అంచానా వేయబడింది. సూపర్‌బగ్‌లు -- యాంటీబయాటిక్స్‌కు నిరోధకంగా మారిన బ్యాక్టీరియా లేదా వ్యాధికారక జాతులు, వాటికి చికిత్స చేయడం చాలా కష్టతరం చేస్తాయి.
Viral Video: సాంప్రదాయ రాజస్థానీ వేషధారణలో ఉన్న ఓ మహిళా సర్పంచ్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ ముందు సర్పంచ్ ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడారు.
Odisha: ఒడిశాలోని కటల్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచింది. సోమవారం నగరంలో ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాలస్తీనా జెండా ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపుని పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్లో జరిగినట్లు వారు తెలిపారు.
Zimbabwe: ఆఫ్రికా దేశాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. కరువు పరిస్థితులతో ఆయా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా బాటలోనే జింబాబ్వే నడుస్తోంది. అధికంగా ఉన్న ఏనుగుల జనాభాని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 200 ఏనుగులను చంపనున్నట్లు ప్రకటించింది. ఏనుగులను చంపాలని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జిమ్‌పార్క్స్)ని ప్రభుత్వం ఆదేశించింది.
Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన తర్వాత యావత్ దేశంలో నిరసన, ఆందోలనలు నెలకొన్నాయి. ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం విజయవంతమైంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు.
India On Iran: భారతీయ ముస్లింలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ మరో పాకిస్తా్న్‌గా మారేందుకు ఆ దేశానికి దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, ఇండియా పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉగ్రవాదులు, రాడికల్ ఇస్లామిక్ భావాలు కలిగిన వ్యక్తులు తరుచుగా భారత వ్యతిరేక, పాక్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మహ్మద్ అలీ జిన్నా వర్ధంతి వేడుకలు ఢాకాలో జరిగాయి. వక్తులు జిన్నాని బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచారు.
Bathing: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో విచిత్రమై సంఘటన జరిగింది. భర్త స్నానం చేయడం లేదని చెబుతూ ఓ మహిళ విడాకులు కోరింది. పెళ్లయిన 40 రోజులకే భర్త నుంచి విడాకుల కోసం అఫ్లై చేసుకుంది. భర్త వ్యక్తిగత పరిశుభ్రత లోపాన్ని చూపుతూ తనుకు విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. భర్త నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేసేవాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆ దాంపత్యం కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు వచ్చింది. Read […]