Bangladesh: పెనం నుంచి పొయ్యిలో పడ్డ బంగ్లాదేశ్.. ఆ దేశంలో ఆర్మీ రూల్..
- పెనం నుంచి పొయ్యిలో పడ్డ బంగ్లాదేశ్..
- ఆ దేశంలో మరోసారి ఆర్మీ రూల్..
- అంతర్గత భద్రత కోసం మెజిస్ట్రేట్ పవర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. రిజర్వేషన్ కోటాకు నిరసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికీ రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. దేశ అంతర్గత భద్రత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆ దేశంలో లేనే లేదు. నిరసనల సమయంలో పోలీసులు టార్గెట్‌గా హత్యలు జరగడంతో, విధుల్లో చేరేందుకు వారు సుముఖత చూపించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు నిత్యకృత్యంగా మారాయి. చాలా మందిని బెదిరించి వారి ఆస్తుల్ని రాయించుకోవడం, మైనారిటీలను బెదిరించి ఉద్యోగాలకు రాజీనామా చేసేలా బలవంతం చేయడం లాంటి పనులు కొనసాగుతున్నాయి.
Read Also: CM Chandrababu: శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష.. టీటీడీ ఈవోకు కీలక ఆదేశాలు..
Also Read
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ఇక జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) వంటి మతోన్మాద పార్టీలు రెచ్చిపోతున్నాయి. బుర్ఖా ధరించకుంటే మహిళలపై దాడులు చేస్తున్నారు. ఇతర మతస్తులతో గుంజీలు తీయిస్తున్నారు. ఇలాంటి ఘటనల్ని అదుపు చేయడంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహ్మద్ యూనస్ శాంతియుతంగా ఉండాలని కోరడం తప్పితే, ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితి చక్కదిద్దేందుకు ఆర్మీ సాయం కోరారు.
పాలన అస్తవ్యస్తంగా మారడంతో మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉద్ జమాన్ కార్యాలయాని వెళ్లి మరీ బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితి గురించి చర్చించారు. ఆర్మీకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కట్టబెట్టింది. ఈ అంశానికి సంబంధించి బంగ్లాదేశ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాబోయే 60 రోజుల పాటు దేశంలో అంతటా జిల్లా మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లుగా పని చేయనున్నారు. ఈ పవర్స్ ద్వారా ఆర్మీ ప్రజలను అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, అల్లర్లని అణిచివేయడానికి కాల్పులు జరడపడం వంటి అధికారాలను కలిగి ఉంటుంది.తాత్కాలిక ప్రభుత్వ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ నిర్ణయానికి కారణాన్ని వివరిస్తూ, చాలా చోట్ల పరిస్థితి విధ్వంసకరంగా ఉందని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాలకు పెద్దపీట వేస్తూ.. ఈ పరిస్థితుల్లో సైన్యానికి మేజిస్ట్రేట్ అధికారాన్ని కల్పించామన్నారు.
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి