Supreme Court: కర్ణాటక హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచరన్ శ్రీశానంద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా స్థానిక ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని ‘‘పాకిస్తాన్’’గా పేర్కొన్నారు. ఇదే కాకుండా ఓ మహిళ న్యాయవాదితో స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టుని ఈ రోజు నివేదిక కోరింది. ల్యాండ్ లార్డ్- కిరాయిదారు వివాదాన్ని ప్రస్తావిస్తూ.. బెంగళూర్‌లోని ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా పేర్కొన్నారు.
Read Also: IND vs BAN: ముగిసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్.. భారీ ఆధిక్యంలో భారత్
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్ ఖన్నా, బిఆర్ గవాయ్, ఎస్ కాంత్ మరియు హెచ్ రాయ్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ న్యామూర్తులు కోర్టులో వారు చేసే వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. కోర్టు గది కార్యకలాపాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో న్యాయస్థానాల నుంచి చేసే వ్యాఖ్యలు ఆశించి విధంగా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
“కోర్టు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై మీడియా నివేదికలపై దృష్టి సారించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుండి సూచనలను కోరిన తర్వాత నివేదికను సమర్పించాలని మేము కర్ణాటక హైకోర్టును అభ్యర్థిస్తున్నాము” అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇదిలా ఉంటే, మరొక కేసు విషయంలో వాదనల సందర్భంగా మహిళా న్యాయమూర్తిని ఉద్దేశిస్తూ.. ‘‘మీకు వారి గురించి (ప్రతిపక్షం) గురించి అంతా తెలుసు, రేపు మీరు వారు ఏ కలర్ ‘‘లోదుస్తులు’’ ధరించారనే విషయాన్ని కూడా చెబుతారు’’ అని వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది.
We call upon the Chief Justice of India to take suo moto action agsinst this judge and send him for gender sensitisation training. pic.twitter.com/MPEP6x8Jov
— Indira Jaising (@IJaising) September 19, 2024