Swati Maliwal: ‘‘అఫ్జల్ గురు ఉరిశిక్షను ఆపడానికి పోరాడిన ఫ్యామిలీ మీది’’.. అతిషీపై స్వాతిమలివాల్ ఫైర్..
- అతిషీ ఢిల్లీ సీఎంగా ఎన్నికవడంపై స్వాతి మలివాల్ ఫైర్..
- అఫ్జల్ గురు ఉరిశిక్షని ఆపేందుకు ప్రయత్నించిన కుటుంబం మీది..
- పార్లమెంట్ ఉగ్రదాడి నిందితుడికి మద్దతుగా నిలవడంపై మలివాల్ ట్వీట్..
- ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి అంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఢిల్లీకి కాబోతున్న కొత్త ముఖ్యమంత్రి అతిషీపై, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని ఎన్నుకున్నారు. అయితే, ఆమెపై అదే పార్టీకి చెందిన స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుకి ఉరిశిక్షని నిలిపేయాలని పోరాడిన కుటుంబం అతిషీది అని ఆమె అన్నారు.
Read Also: Atishi: కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. సీఎంగా ఎన్నికైన అతిషీ తొలి కామెంట్స్..
Also Read
‘‘ ఈ రోజు ఢిల్లీకి చాలా విచారకరమైన రోజు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడేందుకు తన కుటుంబం సుదీర్ఘ పోరాటం చేసిన మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు రాశారు. వారి ప్రకారం, అఫ్జల్ గురు నిర్దోషి మరియు రాజకీయ కుట్రలో భాగంగా ఇరికించబడ్డాడు’’ అని స్వాతి మలివాల్ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు. అతిషీ ‘‘డమ్మీ సీఎం’’ ,ఈ సమస్య జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తుతుందిన మలివాల్ అన్నారు. ‘‘ ఈ సమస్య దేశ భద్రతకు సంబంధించినది. ఢిల్లీని దేవుడే కాపాడాలి!’’ అని ట్వీట్ చేశారు.
2001 పార్లమెంటు దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురును 2013లో ఉరితీశారు. అఫ్జల్ గురు ఉరిని ఆపాలని రాష్ట్రపతికి అతిషి తల్లి త్రిప్తా వాహి రాసిన క్షమాపణ లేఖను మలివాల్ తన ట్వీట్‌లో జోడించారు. లేఖలో త్రిప్తా వాహి.. అఫ్జల్‌కి విధించిన శిక్షను రద్దు చేయాలని, అఫ్జల్ ఎపిసోడ్‌ని పార్లమెంటరీ విచారణ జరిపించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రస్తావించారు.
दिल्ली के लिए आज बहुत दुखद दिन है। आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला को बनाया जा रहा है जिनके परिवार ने आतंकवादी अफ़ज़ल गुरु को फांसी से बचाने की लंबी लड़ाई लड़ी।
उनके माता पिता ने आतंकी अफ़ज़ल गुरु को बचाने के लिए माननीय राष्ट्रपति को दया याचिकाऐं लिखी।
उनके हिसाब से… pic.twitter.com/SbllONqVP0
— Swati Maliwal (@SwatiJaiHind) September 17, 2024
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!