Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్‌లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.
MP Horror: మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం 7 నెలల గర్భిణిని ఆమె భర్త, అత్తామామలు దారుణంగా చంపేశారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. నిందితులు బాధితురాలిని కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆమె భర్తతో పాటు అత్తామామలు, ఇద్దరు ఆడపడచులపై కేసు నమోదు చేశారు.
Asteroid: 120 అడుగుల గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందని నాసా అధికారులు గురువారం ధ్రువీకరించారు. అయితే, దీని వల్ల భూమికి, జీవజాలానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది.
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ మధురలో దళిత బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో ముగ్గురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘటన తర్వాత బాలికను రోడ్డు పక్కన తోసేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
Yahya Ayyash: యాహ్య అయ్యాష్, హమాస్ ఉగ్రసంస్థలో బాంబు తయారీలో నేర్పరి. అందుకే ఇతడిని అందరూ ముద్దుగా ‘‘ది ఇంజనీర్’’గా పిలుచుకునే వారు. ఇతడికి ప్రత్యేకం పెద్ద అభిమాన వర్గమే ఉండేది. ఇతడు తయారు చేసిన బాంబుల్ని చుట్టుకుని ఆత్మాహుతి దాడుల్లో మరణించడం గౌరవంగా భావించేవారంటే అతిశయోక్తి కాదు.
EY CA Death Case: ‘‘ఎర్నెస్ట్ అండ్ యంగ్(EY)’’లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల ఉద్యోగి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ ఇటీవల మరణించిన అంశం కార్పొరేట్ రంగంలో పని గంటలు, ఒత్తిడిని హైలెట్ చేసింది. కార్పొరేట్ రంగంలో ఎలాంటి పని ఒత్తిడి, ఆఫీస్ కల్చర్‌పై పశ్నల్ని లేవనెత్తింది అన్నా తల్లి తన కూతురు ఒత్తిడి,
PM Modi:రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు.
Israel: హిజ్బుల్లా మిలిటెంట్లను ఇజ్రాయిల్ చావు దెబ్బ తీసింది. ఎక్కడ మొబైల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు ఉపయోగిస్తే ఇజ్రాయిల్ కనిపెట్టేస్తోందనే భయంతో అవుట్ డేటెడ్ కమ్యూనికేషన్ పరికరం ‘‘పేజర్’’లను హిజ్బుల్లా మిలిటెంట్లు వాడుతున్నారు.
Hezbollah: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడితో తమ హిజ్బుల్లా గ్రూప్ ‘‘అపూర్వమైన’’ దెబ్బకు గురైందని, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చివరకు అంగీకరించారు.
India’s wedding industry: భారతీయ వివాహ పరిశ్రమ పుంజుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏకంగా 35 లక్షల వివాహాలు జరగబోతున్నాయని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటికి రూ. 4.25 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, 2023లో ఇదే కాలంలో 3.2 మిలియన్ల జంటలు ఒక్కటయ్యాయి.