Mini-Moon: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడికి మరో మినీ-చంద్రుడు తోడు కాబోతున్నాడు. 53 రోజలు పాటు గ్రహ శకలం భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది కంటికి కనిపించదని ఇస్రో నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (NETRA) హెడ్ డాక్టర్ ఎకె అనిల్ కుమార్ తెలిపారు. 2024 PT5 అని పిలువబడే మినీ-మూన్, వ్యాసంలో కేవలం 10 మీటర్లు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఇది మన సాధారణ చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నదని చెప్పారు. చంద్రుడి వ్యాసం 3476 కిలోమీటర్లు.…
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే, వారు దేశాన్ని విభజిస్తారు. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్కి తెలుసు’’ అని అన్నారు.
Nipah Virus: నిపా వైరస్ కేరళని మరోసారి భయపెడుతోంది. మలప్పురం జల్లాలో 24 ఏళ్ల వ్యక్తి వైరస్ బారిన పడి మరణించాడు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగం నిపా మరణాన్ని ధ్రువీకరించిన తర్వాత ఫేస్ మాస్కులు ధరించడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. మలప్పురం జిల్లాలోని తిరువల్లి గ్రామపంచాయతీ, మంపట్ గ్రామపంచాయతీ లోని పలు వార్డుల్లో ఆంక్షలు విధించారు.
Russia: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి హత్యాయత్నం నుంచి బయటపడట్టారు. కొన్ని వారాల ముందు పెన్సిల్వేనియాలోని ఓ ప్రచారంలో మాట్లాడుతున్న సందర్భంగా ట్రంప్‌పై కాల్పులు జరిగాయి, ఈ దాడిలో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది, తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
Fraud: హిందువుగా నటించి ఓ మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల వ్యక్తి హిందువుగా చెప్పుకుంటూ మోసం చేశాడు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని సదరు మహిళని బలవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీలో జరిగింది.
BJP: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇప్పటికే అతడి అమెరికా పర్యటనపై వివాదం నెలకొని ఉంది. సిక్కులపై , రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ సెప్టెంబర్ 6 లండన్‌లో ఉన్నారని, సెప్టెంబర్ 15 వరకు మొత్తం 10 రోజులు విదేశాల్లో గడిపారని, అయితే ఆయన మాత్రం కేవలం 5 గంటలు మాత్రమే బహిరంగ సమావేశాలకు కేటాయించారని, మి
Wolf Attack: ఉత్తర్ ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ తోడేళ్ల దాడుల వల్ల బహ్రైచ్ జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు. నరమాసానికి మరిగిన తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి, 200 మందికి పైగా అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ, ఈ దాడులను అడ్డుకట్ట పడటం లేదు.
Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు రాద్దాంత చేయడంతో బిల్లుని పరిశీలించేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు.
Odisha: ఒడిశాలోని బెర్హంపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరాలా మహారాజా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు కాలేజీ హాస్టల్లో ‘గొడ్డు మాంసం’’ వండారనే ఆరోపణలతో వారిని బహిష్కరించారు.
Trump's Assassination Attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసార హత్యాయత్నం జరిగింది.